TRAI : మొబైల్, లాండ్‌లైన్ నంబర్లకు చార్జీలు
ABN, Publish Date - Jun 14 , 2024 | 04:52 AM
మొబైల్, లాండ్‌లైన్ నంబర్లకు త్వరలోనే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ నంబర్లకు చార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్ నంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
ట్రాయ్ నూతన ప్రతిపాదన
న్యూఢిల్లీ, జూన్ 13: మొబైల్, లాండ్‌లైన్ నంబర్లకు త్వరలోనే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ నంబర్లకు చార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్ నంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఒక చర్చాపత్రంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ మేరకు ఈ నంబర్లకు సంబంధించి మొబైల్ ఆపరేటర్ల నుంచి చార్జీలు వసూలు చేయనున్నారు. అప్పుడు ఆయా కంపెనీలు ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ర్టేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, బ్రిటన్, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ తదితర దేశాలు ఫోన్ నంబర్లకు చార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇలాంటి చర్యలను అనుసరించాలని ట్రాయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Updated Date - Jun 14 , 2024 | 07:53 AM