కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salman Khan: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడే యత్నం.. ఇద్దరి అరెస్ట్

ABN, Publish Date - Jan 08 , 2024 | 03:53 PM

Mumbai: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబై సమీపంలోని పాన్వెల్‌లో ‘అర్పిత ఫామ్స్’ పేరుతో ఫామ్ హౌస్ ఉంది. అయితే ఇద్దరు దుండగులు సల్మాన్ ఖాన్ ఫామ్‌ హౌస్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

Salman Khan: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడే యత్నం.. ఇద్దరి అరెస్ట్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబై సమీపంలోని పాన్వెల్‌లో ‘అర్పిత ఫామ్స్’ పేరుతో ఫామ్ హౌస్ ఉంది. అయితే ఇద్దరు దుండగులు సల్మాన్ ఖాన్ ఫామ్‌ హౌస్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గమనించి వాళ్లను అడ్డుకున్నారు. అనంతరం నవీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్ట్ చేశారు. అయితే సదరు వ్యక్తుల వద్ద నకిలీ ఐడీ కార్డులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సల్మాన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పలు బెదిరింపు కాల్స్ కూడా వెళ్లాయి. ఇప్పుడు ఇద్దరు అనుమానితులు సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నిందితులు సల్మాన్ ఇంటి గోడ ఎక్కి ఫెన్సింగ్‌ను దాటుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారని.. వాళ్లను అదుపులోకి తీసుకుని.. ఐపీసీ సెక్షన్‌లు 420, 448, 465, 468, 471 కింద కేసు నమోదు చేశామని నవీ ముంబై పోలీసులు తెలిపారు. అసలు వాళ్లు ఈ పనికి ఎందుకు ప్రయత్నించారో వివరాలను రాబడుతున్నామని పేర్కొన్నారు.


మరిన్ని నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 03:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising