పొగాకు వ్యతిరేక ప్రకటనలు ఓటీటీల్లోనూ తప్పనిసరి
ABN, Publish Date - Sep 22 , 2024 | 03:29 AM
ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. సినిమా ఆరంభంలో, మధ్యలోనూ 30 సెకన్ల నిడివికి తగ్గకుండా పొగాకు, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ఆడియో, వీడియో ప్రకటనలు, 20 సెకన్ల నిడివితో బిల్‌బోర్డు లేదా నిశ్చల ప్రకటనలు ఉండాలని పేర్కొంది. ఓటీటీ వినియోగదారు ఆ ప్రకటనలను తప్పించడానికి వీలులేని విధంగా పొందుపరచాలని సూచించింది. సెప్టెంబరు 1, 2023 తరువాత సీబీఎ్‌ఫసీ సర్టిఫికెట్ పొందిన ప్రతి సినిమాకూ పైన పేర్కొన్న ప్రకనటలను జత చేయాలని పేర్కొంది.
Updated Date - Sep 22 , 2024 | 03:29 AM