ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మణిపూర్‌లో మళ్లీ హింస

ABN, Publish Date - Feb 17 , 2024 | 03:17 AM

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కుకీ-జో గిరిజనులు అధికంగా ఉండే చురచందాపూర్‌లో గురువారం రాత్రి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు.

భద్రత బలగాల కాల్పుల్లో ఇద్దరి మృతి

చురచందాపూర్‌, ఫిబ్రవరి 16: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కుకీ-జో గిరిజనులు అధికంగా ఉండే చురచందాపూర్‌లో గురువారం రాత్రి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. సుమారు 25 మంది గాయపడ్డారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా 144వ సెక్షన్‌ విధించింది. అయిదు రోజుల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేసింది. సాయుధ తిరుగుబాటుదార్లతో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సెల్ఫీ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం ప్రస్తుత సమస్యకు కారణమయింది. సయాంలాల్‌ పౌల్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఓ సాయుఽధుడు, మరికొందరు గ్రామ రక్షణ వాలంటీర్లతో కలిసి ఉన్న ఫొటో సామాజిక మాఽధ్యమాల్లో దర్శనమిచ్చింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని భావించి ఆ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఇందుకు నిరసనగా సుమారు నాలుగువందల మంది ఎస్పీ కార్యాలయం చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, పోలీసుల తీరుపై ఇండిజినస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా జిల్లాను విడిచి వెళ్లాలని ఎస్పీని హెచ్చరించింది.

Updated Date - Feb 17 , 2024 | 07:57 AM

Advertising
Advertising