ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Monsoon: ప్రజలకు అలర్ట్.. ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్..!

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:18 AM

Monsoon Rains in India: దేశ ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు భారత వాతావరణ శాఖ(Weather Department) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వర్షాకాలంలో(Monsoon) దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు(Rains) కురుస్తాయని వెల్లడించింది. మే తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో, లా నినా పిరిస్థితుల ప్రభావం తగ్గుతుందని..

Weather Report

Monsoon Rains in India: దేశ ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు భారత వాతావరణ శాఖ(Weather Department) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వర్షాకాలంలో(Monsoon) దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు(Rains) కురుస్తాయని వెల్లడించింది. మే తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో, లా నినా పిరిస్థితుల ప్రభావం తగ్గుతుందని.. ఈ సంవత్సరం రుతుపవనాల సమయంలో దేశంలో వర్షాలు భారీగానే కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే వర్షాకాలంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ, ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవి కాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈశాన్య ద్వీపకల్ప భారతదేశం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఇక మార్చిలో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాల సగటు 29.9 మి.మీలో 117 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. ఇక మార్చి నుండి మే మధ్య కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.’ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో పరిస్థితులు వేసవి కాలం తరువాత తటస్థంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో.. దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2024 | 11:18 AM

Advertising
Advertising