కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Reels: రీల్స్ పిచ్చి.. భర్త వద్దనడమే తప్పయిపోయింది.. ఏం చేసిందంటే..?

ABN, Publish Date - Jan 09 , 2024 | 05:01 PM

సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే.. రీల్స్ చేయొద్దని చెబితే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చంపేందుకు కూడా వెనకాడటం లేదు. బీహార్‌లో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

 Reels: రీల్స్ పిచ్చి.. భర్త వద్దనడమే తప్పయిపోయింది.. ఏం చేసిందంటే..?

పాట్నా: సోషల్ మీడియా (Social Media) వచ్చిన తర్వాత కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే.. రీల్స్ (Reels) చేయొద్దని చెబితే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చంపేందుకు కూడా వెనకాడటం లేదు. బీహార్‌లో (Bihar) అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చేయొద్దని భర్త చెప్పడమే పాపమైపోయింది. వద్దన్నందుకు అతనిని భార్య హతమార్చింది.

బెగుసరాయ్‌కు చెందిన మహేశ్వర కుమార్ రాయ్‌కి (Maheshwara Kumar Rai) రాణికుమారితో (Rani Kumari) ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. మహేశ్వర కోల్ కతాలో కూలీగా పనిచేస్తాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య మళ్లీ రీల్స్ చేస్తుందని తెలిసింది. ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. గొడవ గురించి తెలిసిన మహేశ్వర్‌కు రాణికి మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అతని తండ్రి చెప్పాడు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని రాణి (Rani) నిర్ణయం తీసుకుంది. తనకు ఇష్టం అయిన రీల్స్ చేయనీయడం లేదని, వివాహేతర సంబంధం గరించి తెలిసిందని అనుకుంది. ఆదివారం రోజు తన బంధువుల ఇంటికి పిలిచింది. రాణి కుట్ర తెలియక మహేశ్వర వెళ్లాడు. అక్కడ రాణి లవర్ సజ్జద్, రాణి చెల్లెలు రోజి, సోనాలి కుమారి ఉన్నారు. వారంతా కలిసి గొంతు కోసి హతమార్చారు.

ఆదివారం రాత్రి 10.30 గంటలకు సోదరుడు రుదాల్ కోల్ కతా నుంచి మహేశ్వర ఫోన్ చేశాడు. మరొకరు ఎత్తడంతో అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లాలని తండ్రికి చెప్పడం.. వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అక్కడ మహేశ్వర విగతజీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య రాణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చెల్లెలను ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 05:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising