అద్బుతమైన అద్దం
ABN, Publish Date - Jul 19 , 2024 | 02:25 AM
ఒక దేశాన్ని పాలించే రాజుకు విక్రముడు అనే కొడుకు ఉన్నాడు అతనికి వివాహం చేయాలని నిర్ణయించుకుని, రాజు తన మంత్రులను పిలిచి ఇలా చెప్పాడు ‘అందగాడు, గుణవంతుడు ధైర్యశాలి ఐన విక్రముడికి అంతే...
ఒక దేశాన్ని పాలించే రాజుకు విక్రముడు అనే కొడుకు ఉన్నాడు అతనికి వివాహం చేయాలని నిర్ణయించుకుని, రాజు తన మంత్రులను పిలిచి ఇలా చెప్పాడు ‘అందగాడు, గుణవంతుడు ధైర్యశాలి ఐన విక్రముడికి అంతే సుగుణాలున్న వధువును వెతకాలి. మీరు ఇలా ప్రకటన చేయించండి. ‘మన దగ్గర ఒక అద్భుతమైన మాయా అద్దం ఉందనీ అందులో మొహం చూసుకున్నా వారి మనసులో ఏమైనా దురాలోచనలు ఉంటే, అద్దంలో వారి మొహం మీద నల్లటి మచ్చలు కనిపిస్తాయనీ దీనికి సిద్ద పడినవారు పరీక్షలో నెగ్గి, యువరాణి కావచ్చుననీ ప్రచారం చేయండి అని చెప్పి మంత్రులను పంపేశాడు రాజు. చాలా మంది అమ్మాయిలు యువరాజును వివాహమాడాలి అనుకున్నారు కానీ, అద్దంలో చూసుకున్నపుడు తమ మొహం మీద మచ్చలు కనిపిస్తే ఎలా అన్న భయంతో వారెవరూ అద్దం పరీక్షకు ముందుకు రాలేదు. చివరగా ఒక పల్లె పడుచు పరీక్షకు తాను సిధ్దం అని ముందుకు వచ్చింది. నిబంధన తెలుసుగా అన్నాడు రాజు తెలుసు మహారాజా.. నా మనసులో ఎలాంటి దురాలోచనలు ఉండవు.
మా పల్లెలో ఎవరైనా తప్పులు చేస్తే, దిద్దుకుంటాం, ఒకరినొకరు క్షమించుకుంటాం అన్నది ఆమె. అద్దంలో తన మొహం చూసుకుంది. మచ్చలేమీ కనపడలేదు అపుడు మహారాజు ఇది మిగతావాటిలాగే ఒక సాధారణ అద్దం కానీ దురాలోచన విషయం చెప్పేసరికి ఎవ్వరూ సాహసం చేయలేదు. ఈ అమ్మాయి మాత్రమే ఆత్మ విశ్వాసంతో ముందుకు వచ్చింది కాబట్టి, ఈమెనే విక్రముడికి కాబోయే భార్య, మరియు ఈ దేశపు యువరాణి ఇలాంటి ఆత్మ విశ్వాసం కల అమ్మాయిని వెతకడానికే ఈ పరీక్ష, ప్రకటన అంతానూ అన్నాడు మహారాజు.
Updated Date - Jul 19 , 2024 | 02:25 AM