Skin Health : క్లీన్ బ్యూటీ చర్మం కావాలంటే ఈ క్రీమ్స్ వాడి చూడండి..
ABN, Publish Date - Jul 18 , 2024 | 03:48 PM
క్లీన్ బ్యూటీగా కనిపించాలంటే సహజమైన పదార్థాలతో తయారు చేసే క్రీమ్స్ ఎంచుకోవడమే. క్రీమ్స్ రాసుకోవడం వల్ల వయసు మీద పడుతున్న ఫీలింగ్ తగ్గుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్ రాసుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.
ఆడవారి అందాన్ని పెంచడానికి మేకప్ అద్భుతమైన మార్గం. అయితే అస్తమానూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మం పాడయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. అంతేకాదు త్వరగా ముసలితనం వచ్చేసినట్టుగా ఉంటుంది. ఈ సమస్యను దాటాలంటే.. మేకప్ వేసుకోవాలంటే వెనకడుగువేసే చాలా మందికి ఫేస్ క్రీమ్స్ వాడటం వల్ల మేకప్ తో కలిగే నష్టం చాలా వరకూ తగ్గుతుంది. ఫేస్ క్రీమ్స్ వల్ల చాలా అందంగా కనిపిస్తారు. మేకప్ కి చెక్ పెట్టి క్రీమ్స్ తో అందంగా కనిపించవచ్చు.
బ్యూటీ ఇండస్ట్రీలో క్లీన్ బ్యూటీ అనే పదం మరింత ప్రాచుర్యం పొందింది. ఇది హానికరమైన రసాయనాలు, సంకలనాలతో, విషరహితంగా, సహజ పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తులు. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. క్లీన్ బ్యూటీ అనేది సహజమైన నాన్ టాక్సిక్ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడాన్ని ప్రచారం చేసే ఉద్యమం. క్లీన్ అంటే కఠినమైన రసాయనాలు, సింథటిక్ సువాసనలు కానీ, పారాబెన్, సల్ఫేట్లు, థాలేట్స్ వంటి కాకుండా సహజమైన పదార్థాలు, మొక్కుల, ఖనిజాలు, ఇతర సహజ వనరుల నుంచి తీసుకోబడ్డాయి. ఇవి చర్మానికి సురక్షితమైనవి.
క్లీన్ బ్యూటీ మన చర్మ ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
క్లీన్ బ్యూటీగా కనిపించాలంటే సహజమైన పదార్థాలతో తయారు చేసే క్రీమ్స్ ఎంచుకోవడమే. క్రీమ్స్ రాసుకోవడం వల్ల వయసు మీద పడుతున్న ఫీలింగ్ తగ్గుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్ రాసుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. ఈ క్రీమ్లలో విటమిన్ బి6 తో పాటుగా ఇతర విటమిన్లు కూడా ఉంటాయి. పొడి, జిడ్డు రకం చర్మాలకు ఫేస్ క్రీమ్ లతో చెక్ పెట్టవచ్చు. అందం రెట్టింపు కావడమే కాకుండా మంచి గ్లో సొంతం అవుతుంది.
ఫేస్ క్రీమ్ సూర్యడి నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఈ క్రీమ్స్ ముఖ్యంగా మల్బరీ, ద్రాక్ష ఫ్లేవర్స్ లలో దొరుకుతాయి. అన్ని రకాల స్కిన్ టోన్స్ గల వారికి కూడా ఈ క్రీమ్స్ కచ్చితంగా సరిపోతాయి. వీటితో చర్మంలో ఉత్పత్తి అయ్యే మెలనిన్ స్థాయి తగ్గుతుంది.
Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
ఏ కంపెనీ అయినా విటమిన్, పోషకాల స్థాయిలు చూసుకుని ఎంచుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఫేస్ క్రీమ్ అన్ని రకాల చర్మాల వారికి సరిపోతుంది. పైగా కాంతివంతంగా మారుస్తుంది. అందాన్ని రెట్టింపుగా చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 18 , 2024 | 03:48 PM