ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Multani Mitti Mask : జిడ్డు చర్మం నుంచి ఉపశమనానికి ముల్తానీ మాస్క్ చాలు.. !

ABN, Publish Date - Jul 13 , 2024 | 02:08 PM

ముల్కానీ మట్టిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెరిసే ఛాయను ఇస్తుంది.

skin glow

వాతావరణం ఏదైనా ముఖం జిడ్డుగా మారుతుందంటే మాత్రం చిన్న చిట్కాలతో ముఖాన్ని కాంతి వంతంగా మార్చుకోవచ్చు. మనందరికీ తెలిసిందే ముల్తానీ మట్టి జిడ్డు చర్మానికి మంచి ఆరోగ్యకరమైన మెరుపునిస్తుంది. జిడ్డు చర్మం తేమతో కూడిన వాతావరమంలో ఇబ్బందిగా మారుతుంది. ఇది చర్మ రంధ్రాలను అడ్డుకోవడం, మొటిమలను తగ్గిస్తుంది. చర్మ మెరుపును పెంచుతుంది. జిడ్డు చర్మాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముల్కానీ మట్టిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెరిసే ఛాయను ఇస్తుంది.

వేప క్లెన్సర్..

వేప శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది జిడ్డు చర్మాన్ని తగ్గించి చర్మానికి మెరుపును ఇస్తుంది. దీనితో పాటు ముల్తానీ మట్టి కలిపి ముఖానికి వేసుకుంటే మంచిది.

వేపపేస్ట్, ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు ఇలాంటి ప్యాక్ వేసుకోవడం ఉత్తమం.

Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !

శాండిల్ ప్యాక్..

చందనం, ముల్తానీ మట్టి కలిపి వేసుకునే ప్యాక్ చర్మాన్ని మంటనుంచి, స్కిన్ టోన్ పెరిగేందుకు సహకరిస్తుంది.

గంధపు పొడిలో రోజ్ వాటర్, ముల్తానీ మట్టి కలిపి ఆ పేస్ట్ ను ముఖానికి వేయాలి. ఇది 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం నిగారింపుగా ఉంటుంది.


Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !

తులసి టోనర్..

తులసి ఆకులలో శక్తివంతమైన పోషకాలున్నాయి. ఇవి జిడ్డు చర్మానికి అద్భుతమైనది. క్రిమినాశక లక్షణాలున్నాయి. బ్లాక్ హెడ్స్, మొటిమలను తగ్గిస్తుంది.

తాజా తులసి ఆకులతో నీటిని సుమారు 10 నిమిషాలు ఉడికించి ఆ నీటిని ముఖం మీద స్ప్రే చేయాలి. మల్తానీ మట్టి, తులసి నీరు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపటి తర్వాత శుభ్రం చేయాలి.

అలోవేరా జెల్.. అలోవెరా జెల్, ముల్తానీ మట్టి కలిపి వేసే ప్యాక్ ముఖానికి నిగారింపును ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. చర్మం హైడ్రేట్‌గా ఉండాలంటే నీరు పుష్కలంగా తాగాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 13 , 2024 | 02:08 PM

Advertising
Advertising
<