ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారే సుజనులు

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:10 PM

మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంతః సంతి సంతః కియంతః...

మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః

త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః

పరగుణ పరమాణూన్పర్వతీకృత్య నిత్యం

నిజహృది వికసంతః సంతి సంతః కియంతః... అంటూ సుజనుల లక్షణాలను...తన నీతి శతకంలో భర్తృహరి వర్ణించాడు. దాన్ని...

హృదయ వచశ్శరీరముల నెంతయు పూర్ణ సుధాప్రపూర్ణులై

ముదము బహూపకారముల మూడు జగంబులకున్‌ ఘటించుచున్‌

వదలక సాధు సద్గుణలవంబులు కొండలు నేసి మెచ్చుచున్‌

మదిని వికాస యుక్తులగు మాన్యులు కొందరు వొల్తురిద్ధరన్‌... అని తెలుగులోకి అనువదించాడు ఏనుగు లక్ష్మణకవి.

భావం: మనసా, వాచా, కర్మణా... అంటే త్రికరణ శుద్ధిగా మంచి పనులు చేయాలనే తపన ఉన్నవారు, సమస్త ప్రజలూ ఆనందంగా ఉండాలని కోరుకొనేవారు, అలాంటి ఆనందాన్ని వారికి కలిగించేవారు, అందరినీ తమ ఉపకార బుద్ధితో ఆదుకొనేవారు, ఇతరులలో సద్గుణాలు గోరంత ఉన్నా వాటిని కొండంతగా భావించి మెచ్చుకొనేవారు సుజనులు. అలాంటివారు ఈ లోకంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.

Updated Date - Aug 29 , 2024 | 11:10 PM

Advertising
Advertising