ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీఎల్‌వో సస్పెన్షన్‌

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:31 AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జలానీ సమూన్‌ హెచ్చరించారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం పంచాయతీ పోలీసు క్వార్టర్స్‌లోని పోలింగ్‌ బూత్‌ 254లో ఓటరు జాబితాలో తప్పిదాలు జరిగాయని పలు ఫిర్యాదులు వచ్చాయి.

- ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

- నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు : కలెక్టర్‌

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 12: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జలానీ సమూన్‌ హెచ్చరించారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం పంచాయతీ పోలీసు క్వార్టర్స్‌లోని పోలింగ్‌ బూత్‌ 254లో ఓటరు జాబితాలో తప్పిదాలు జరిగాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎల్‌వో సస్పెన్షన్‌ చేశారు. మరో ఇద్దరు అధికారులకు సోమవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ బూత్‌ పరిధిలోని 250 మంది ఓటర్ల పేర్లు శిఽథిలావస్థలో ఉన్న క్వార్టర్స్‌లో ఉన్నట్టు జాబితాలో ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే క్వార్టర్స్‌ కొన్నాళ్లుగా నివాసయోగ్యంలేదు. ఇక్కడి పోలీసు సిబ్బంది సమీపంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయినా ఓటరు జాబితాలో పేర్లు ఉండటాన్ని తప్పుగా గుర్తించారు. దీనికి బాధ్యునిగా పేర్కొంటూ సంబంధిత బీఎల్‌వో పి.రవికుమార్‌ను సస్పెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి తహసీల్దార్‌ టి.సత్యనారాయణ, సూపర్‌వైజర్‌ ప్రేమ్‌కుమార్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 12:34 AM

Advertising
Advertising