ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెటింగ్‌ మెసేజెస్‌ బ్లాకింగ్‌ ఇలా

ABN, Publish Date - Jun 28 , 2024 | 11:55 PM

వాట్సాప్‌ ద్వారా బిజినెస్‌ ప్రమోషన్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. భారత దేశానికి చెందిన పలు వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్‌ యూజర్లు తమ యాప్‌ తెరిస్తే చాలు, సదరు మెసేజ్‌లతో బాక్స్‌లు నిండుతున్నాయి. వాటిని తొలగించుకోవడం నిజానికి పెద్ద పని

వాట్సాప్‌ ద్వారా బిజినెస్‌ ప్రమోషన్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. భారత దేశానికి చెందిన పలు వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్‌ యూజర్లు తమ యాప్‌ తెరిస్తే చాలు, సదరు మెసేజ్‌లతో బాక్స్‌లు నిండుతున్నాయి. వాటిని తొలగించుకోవడం నిజానికి పెద్ద పని. సమయం కూడా వృథా అవుతుంది. ప్రభుత్వం సైతం వీటిని అరికట్టే యత్నాల్లోనే ఉంది. వాట్సాప్‌ ఈ రోజుల్లో ఒక మంచి కమ్యూనికేషన్‌ సాధనం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ప్రయాణాలకు సంబంధించి టికెట్స్‌ నుంచి ఎంతో విలువైన సమాచారాన్ని స్టోర్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ ఉపయోగపడుతోంది. అయితే మధ్యలో ఈ బిజినెస్‌ మెసేజ్‌లు యూజర్లకు చాలా చిరాకు కలిగిస్తున్నాయి. వాటిని నిరోధించేందుకు ముఖ్యంగా....

  • కాంటాక్ట్‌ లిస్టు నుంచి బ్లాక్‌ చేయడం ఒక పద్ధతి. ఒకసారి బ్లాక్‌ చేస్తే వ్యాపార సముదాయాలు తమ ప్రచారాన్ని పంపలేవు. అయితే వాటి బిజినెస్‌ ప్రొపైల్‌, కేటలాగ్స్‌లో ఆ సంస్థలకు సదరు నంబర్ల యాక్సెస్‌ మాత్రం ఉంటుంది.

  • యూజర్లకు రిపోర్ట్‌ చేసే అవకాశం ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు అనుకుంటే యూజర్లు ఆ పని చేయవచ్చు.

  • అదే మాదిరిగా యూజర్లకు కంటిన్యూ ఆప్షన్‌ కూడా ఉంటుంది. సదరు వ్యాపార సంస్థతో సంబంధాలను మెయింటైన్‌ చేయవచ్చు. బిజినెస్‌ సంస్థలతో మెసేజింగ్‌కు చొరవ కూడా చూపించవచ్చు.

  • కొన్ని సంస్థలు మాత్రం తమ ప్రచారం వద్దనుకుంటే డిక్లెయిన్‌ని ఎంచుకునే అవకాశాన్ని యూజర్లకు ఇస్తాయి. యూజర్‌ దాన్ని యాక్టివేట్‌ చేసుకుంటే చాలు, తమ జాబితా నుంచి సదరు వ్యక్తిని ఆ వ్యాపార సంస్థ తొలగిస్తాయి. ఈ ఫీచర్‌ లేకుంటే బ్లాక్‌ చేయడం తప్ప మరో ఆప్షన్‌ ఉండదు.

Updated Date - Jun 28 , 2024 | 11:55 PM

Advertising
Advertising