కవ్వించే... కౌల్ ప్యాంట్స్
ABN, Publish Date - Sep 18 , 2024 | 05:57 AM
నెక్‌లైన్ వరకూ బాటమ్ వేర్ వరకూ కౌల్ డిజైన్, మహిళల మనసులను దోచుకుంటూనే ఉంది. రిలాక్స్‌డ్ లుక్‌ను తెచ్చిపెట్టే కౌల్ ప్యాంట్స్‌తో ఫ్యాషనబుల్‌గా ఎలా కనిపించాలో తెలుసుకుందామా?
నెక్‌లైన్ వరకూ బాటమ్ వేర్ వరకూ కౌల్ డిజైన్, మహిళల మనసులను దోచుకుంటూనే ఉంది. రిలాక్స్‌డ్ లుక్‌ను తెచ్చిపెట్టే కౌల్ ప్యాంట్స్‌తో ఫ్యాషనబుల్‌గా ఎలా కనిపించాలో తెలుసుకుందామా?
మాంక్స్ ధరించే హుడ్‌ను ల్యాటిన్‌లో కుకుల్లా అంటారు. దీన్నుంచే కౌల్ అనే పదం పుట్టుకొచ్చింది. హుడ్‌ను పోలినట్టుండే కౌల్ ప్యాంట్ ఫ్యాషన్ ప్రపంచవ్యాప్త ఆదరణకు నోచుకోడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆధునికంగా కనిపించడంతో పాటు, సౌకర్యంగా ఉండడం, అన్ని రకాల సందర్భాలకూ అనువుగా ఉండడం వల్ల కౌల్ ప్యాంట్స్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయాయి.
స్టైలింగ్: క్యాజువల్ లుక్ కోసం ఫిట్టెడ్ టాప్, సింపుల్ టి షర్ట్‌తో కౌల్ ప్యాంట్‌ను మ్యాచ్ చేసి ధరించవచ్చు. ఈవినింగ్ వేర్ లుక్ కోసం, వీటిని బ్లౌజ్ లేదా స్ట్రక్చర్డ్ జాకెట్‌తో కలిపి ధరించవచ్చు.
డ్రేప్‌డ్/ఫ్లోయింగ్: మెత్తగా, జారిపోతున్నట్టుండే ఫ్యాబ్రిక్‌తో కుట్టిన కౌల్ ప్యాంట్స్ అన్ని అకేషన్లకూ బాగుంటాయి. నడుము, పిరుదుల దగ్గర ప్లీట్స్‌ను కలిగి ఉండే ఈ తరహా కౌల్ ప్యాంట్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.
సౌకర్యం, సౌలభ్యం: సౌకర్యంగా వినూత్నంగా కనిపించడమే లక్ష్యంగా రూపొందే కౌల్ ప్యాంట్స్ అన్ని రకాల బాడీ టైప్స్‌కూ సూటవుతాయి. వదులుగా ఉంటాయి కాబట్టి సన్నగా ఉండేవాళ్లకే ఈ ప్యాంట్లు సూటవుతాయనుకుంటే పొరపాటు. ఫ్లోయీ డిజైన్ మూలంగా ఈ ప్యాంట్లు అన్ని శరీరాకృతులకూ చక్కగా సూటవుతాయి.
సందర్భాన్ని బట్టి: ఫ్యాబ్రిక్, డిజైన్ ఆధారంగా సందర్భానికి తగ్గట్టు ఎంచుకోదగిన కౌల్ ప్యాంట్స్ కూడా ఉంటాయి. జెర్సీ, సిల్క్, లేదా లైట్ వెయిట్ వూల్ ప్యాంట్లు పార్టీ వేర్‌గా సూటవుతాయి. కాటన్, శాటిన్ కౌల్ ప్యాంట్స్ ఈవినింగ్ వేర్‌కు సూటవుతాయి.
Updated Date - Sep 18 , 2024 | 05:57 AM