మీకు తెలుసా?
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:36 AM
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చాలా మంది ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ అనుకుంటారు...
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చాలా మంది ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ అనుకుంటారు. బ్రిటన్‌కు చెందిన ఎలాన్ ట్యూరింగ్ అనే ఒక శాస్త్రవేత్త - కంప్యూటర్లకు ఇంటిలిజెన్స్ ఉంటుందా? లేదా అనే విషయాన్ని కనుగొనటానికి టర్నింగ్ టెస్ట్‌ను రూపొందించాడు. మనకు తెలిసిన తొలి ఏఐ ప్రొగ్రామ్ ఇదే! దీనిని 1956లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో దీనిని తొలిసారి ప్రదర్శించాడు.
ఏఐ పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వారిలో 40 శాతం మందికి ఉద్యోగాలు ఉండవని.. వారి స్థానాలను ఏఐ భర్తీ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మానవుల మాదిరిగా పనిచేసే తొలి రోబో పేరు సోఫియా. దీనిని 2016లో తయారుచేశారు. ఇది మానవుల మాదిరిగానే మాట్లాడగలుగుతుంది. 2017లో దీనికి సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ఇచ్చారు.
Updated Date - Jun 20 , 2024 | 12:36 AM