Technology : న్యాయ సేవల్లో చాట్ జీపీటీ వద్దు
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:16 AM
ఇటీవల ప్రతీదానికీ చాట్ జీపీటీ సేవలు వాడుకోవడం కామన్‌గా మారింది. అయితే న్యాయ సేవల కోసం చాట్ జీపీటీని ఉపయోగించవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు వద్దంటున్నామో కూడా సాధికారికంగా వివరిస్తున్నారు. అసలు విషయానికి వెళ్ళే ముందు మరికొన్నింటిని తెలుసుకోవాలి. వాస్తవానికి ఒక సర్వే ప్రకారం 52 శాతం మంది మాత్రమే ప్రొఫెషనల్స్ నుంచి న్యాయ సేవలు అందుకుంటున్నారు. పదకొండు శాతం మంది తమ స్నేహితులు, బంధుమిత్రుల సలహాలు తీసుకుంటున్నారు. మిగిలిన వారికి న్యాయ సేవలు అందటం లేదు, నిస్సహాయులుగా ఉండిపోతున్నారు.
ఇటీవల ప్రతీదానికీ చాట్ జీపీటీ సేవలు వాడుకోవడం కామన్‌గా మారింది. అయితే న్యాయ సేవల కోసం చాట్ జీపీటీని ఉపయోగించవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు వద్దంటున్నామో కూడా సాధికారికంగా వివరిస్తున్నారు. అసలు విషయానికి వెళ్ళే ముందు మరికొన్నింటిని తెలుసుకోవాలి. వాస్తవానికి ఒక సర్వే ప్రకారం 52 శాతం మంది మాత్రమే ప్రొఫెషనల్స్ నుంచి న్యాయ సేవలు అందుకుంటున్నారు. పదకొండు శాతం మంది తమ స్నేహితులు, బంధుమిత్రుల సలహాలు తీసుకుంటున్నారు. మిగిలిన వారికి న్యాయ సేవలు అందటం లేదు, నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. లా సొసైటీ, లీగల్ సర్వీసెస్ బోర్డు, యువగవ్ ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. గడచిన నాలుగేళ్ళ కాలంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లీగల్ సమస్య ఎదురైంది. నిరుద్యోగం, ఫైనాన్స్, సంక్షేమం, ప్రయోజనం, వినియోగదారుల సమస్యలు లీగల్‌కు సంబంధించిన వాటిలో ముఖ్యమైనవిగా ఆ సర్వే తేల్చింది. అలాగే అందరికీ న్యాయ సహాయం ప్రొఫెషనల్స్ నుంచి తీసుకోవడం సాధ్యం కాదని కూడా తెలిపింది.
ఈ నేపథ్యంలోనే లీగల్ అంశాలకు సంబంధించి ఎక్కువ మంది ఇంటర్నెట్ సహకారం తీసుకుంటున్నారు. చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ కోపైలెట్, క్లాడేని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ టూల్స్ అన్నీ జనరేటివ్ ఏఐ పవర్‌ని కలిగి ఉంటున్నాయి. ప్రధానంగా ఈ చాట్‌బోట్స్ అందిస్తున్న న్యాయ సహాయంపై ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ ఒక స్టడీని ఇటీవల నిర్వహించింది. అడిగిన ప్రశ్న, ఇస్తున్న సమాధానం అవసరానికి తగ్గట్టు లేవని తేల్చింది. ముఖ్యంగా...
సమాధానాలు అమెరికా న్యాయ చట్టాలకు లోబడి ఉంటాయి. అయితే ప్రశ్న అడిగిన వ్యక్తి తనుంటున్న ప్రదేశంలో అది వర్తిస్తుందనే భావిస్తారు. ఒక ప్రాంతానికి వేరే చోటుకు మధ్య తేడా ఉంటుందన్నది చాట్‌బోట్ తెలియజేయదు. యూకేలో ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది. ఇంగ్లండ్ - వేల్స్, స్కాట్లాండ్ - నార్త్ ఐర్లాండ్ మధ్య తేడా ఉంటుంది. ఉదాహరణకు ఇంటి అద్దెకు సంబంధించే చట్టాలు వేర్వేరు. విడాకులు, సివిల్ భాగస్వామ్యంలోనూ ఇదే ఇబ్బంది.
కాలక్రమంలో కొత్త చట్టాలను వివిధ దేశాలు రూపొందిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇంగ్లండ్, వేల్స్‌లో 2002 ఏప్రిల్‌లో విడాకుల చట్టాన్ని మార్చారు. మన దేశంలోనూ గడచిన ఏడాది చట్టపరంగా కొన్ని మార్పులు చేశారు. అప్డేట్ అయిన చట్టాలను అనుసరించి ఇక్కడ సలహాలు ఉండవు.
కుటుంబం, ఉద్యోగ సంబంధిత విషయాల్లో తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది. అవి మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. కొన్నింటిలో సలహాలు బాగుంటాయి. అయినప్పటికీ ఇంకా స్పందనలో గ్యాప్స్ అలానే ఉంటున్నాయి. కొన్ని సార్లు ముఖ్యమైన పాయింట్లు సమాధానంలో ఉండటం లేదు. చాలా బాగా రాసి ఉన్నప్పటికీ లీగల్ పాయింట్లు అందులో కనిపించడం లేదు.
పూర్తిగా జనరిక్‌గా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న సమాచారాన్ని ఇవ్వడం తప్ప లీగల్‌గా అడిగిన నిర్దిష్ట ప్రశ్నకు తగ్గ సమాధానం సూటిగా ఉండటం లేదు. ప్రాక్టికల్ అయినప్పటికీ అందులో లీగల్ యాంగిల్ ఉండటం లేదు. అలాంటివి ప్రస్తావించి చట్టపరమైన ఆదేశాలు పొందడం కష్టమనే చెప్పాలి.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏఐ తరహా సమాధానాల్లో చాట్‌జీపీటీ4 అంటే పెయిడ్ వెర్షన్ బెటర్ అని చెప్పవచ్చు. మొత్తమ్మీద ఈ సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే రిస్క్ ఉంటుందని చెప్పకతప్పదు. చాట్‌బోట్స్ అన్నీ అడిగిన వాటికి తగ్గ సమాధానాలు ఇస్తాయి. అయితే ప్రొఫెషనల్ హెల్స్ తీసుకునే ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఈ సర్వేలో వెల్లడైంది.
Updated Date - Jun 08 , 2024 | 05:17 AM