ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

iPhone 16 : ఐఫోన్‌ 16 రీడిజైన్‌తో ఫీచర్ల మెరుగు

ABN, Publish Date - Jun 28 , 2024 | 11:58 PM

ఐఫోన్‌ 16 విడుదల తేదీని ఇంకా ప్రకటించినప్పటికీ సంబంధిత ఫీచర్ల విషయమై లీక్‌లు మాత్రం ఆగటం లేదు. మేజర్‌ రీడిజైన్‌ ప్రస్తావన ఇప్పుడు యవనికపైకి వచ్చింది. కెమెరా ఫీచర్ల నుంచి పర్ఫార్మెన్స్‌లో మెరుగుదల వరకు అన్నీ బైటకు వస్తూనే ఉన్నాయి. రీడిజైన్‌కు

ఐఫోన్‌ 16 విడుదల తేదీని ఇంకా ప్రకటించినప్పటికీ సంబంధిత ఫీచర్ల విషయమై లీక్‌లు మాత్రం ఆగటం లేదు. మేజర్‌ రీడిజైన్‌ ప్రస్తావన ఇప్పుడు యవనికపైకి వచ్చింది. కెమెరా ఫీచర్ల నుంచి పర్ఫార్మెన్స్‌లో మెరుగుదల వరకు అన్నీ బైటకు వస్తూనే ఉన్నాయి. రీడిజైన్‌కు సంబంధించిన వాటిని తాము సంపాదించినట్టు తాజాగా ‘టెక్‌నెట్‌బుక్‌’ తెలిపింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం ప్రొ, నాన్‌ ప్రొ మోడల్స్‌లో ఇకపై వెర్టికల్‌ కెమెరా కాన్ఫిగరేషన్‌ ఉండనుంది. తద్వారా 3డి వీడియో రికార్డింగ్‌ ఫీచర్‌ మెరుగుపడుతుంది. స్పేషియల్‌ వీడియో్‌సగా బ్రాండ్‌ అవుతాయి. అడ్వాన్స్‌డ్‌ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ సామర్ధ్యాల పెంపు అలాగే మిక్స్‌డ్‌-రియాల్టీ ప్రాజెక్ట్స్‌తో ఇంటిగ్రేషన్‌కు అవకాశం ఉంటుంది. స్టాండర్డ్‌ ఐఫోన్‌ మోడల్స్‌కు యాక్షన్‌ బటన్‌ను పరిచయం చేస్తోంది. దీనికి తోడు ప్రొ సిరీ్‌సకు డెడికేటెడ్‌ షట్టర్‌ బటన్‌ను ఉంచనున్నట్టు సమాచారం. హాప్టిక్‌ ఇంజన్‌ పవర్‌ కలిగి ఉంటుంది. దీంతో వేర్వేరు లెవెల్స్‌తో ఫొటోలను తీసుకోవచ్చు. ఫిజికల్‌ బటన్స్‌ అన్నింటినీ తొలగిస్తారన్న పుకారు కూడా వినవచ్చింది. సరికొత్తగా టాక్టికల్‌ కంట్రోల్స్‌ను ఇంటిగ్రేట్‌ చేయవచ్చు. ప్రొ మోడల్స్‌లో ఈ పని చేయవచ్చని అంటున్నారు. కెమెరా మాడ్యూల్‌కు ఔట్‌సైడ్‌లో ఫ్లాష్‌ యూనిట్‌ ఉండనుంది. 6.1 ఇంచీలు, 6.7 ఇంచీల ఓలెడ్‌ డిస్‌ప్లేకి తోడు 60 హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు ఉండనుంది. ఎ17 ప్రొ చిప్‌ కారణంగా లేటెస్ట్‌ యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను సపోర్ట్‌ చేస్తుందని అంటున్నారు.

Updated Date - Jun 28 , 2024 | 11:58 PM

Advertising
Advertising