ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jackie Shehulk: ఈ భామ కండలు చూస్తే అబ్బాయిలు కంగుతింటారు!

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:57 PM

ఈ భామ.. కండలు చూస్తే అబ్బాయిలు కంగుతింటారు. బరువులెత్తడంలో ఆమెను మించినవారు లేరు. ప్రొఫెషనల్‌ కిక్‌బాక్సర్‌ నుంచి పవర్‌లిఫ్టర్‌గా మారి తన పవర్‌ను ప్రదర్శిస్తోంది.

జాకీ కూర్న్‌.. కండలు తిరిగిన శరీరం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా? ఈ లేడీ పవర్‌ లిఫ్టర్‌ రోజుకు పది గుడ్లు అవలీలగా లాగించేస్తుంది. ప్రతీ రెండు గంటలకొకసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్‌, ఫిష్‌, గ్రానోల, పాలకూరను రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకుంటుంది. అలాగే రోజూ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతుంది. 100 పుషప్స్‌, 250 సిటప్స్‌తో రోజును ప్రారంభిస్తుంది. దాదాపు 90 నిమిషాలు వర్కవుట్ల కోసం కేటాయిస్తుంది.

ఆమె కండలు చూస్తే అబ్బాయిలు కంగుతింటారు. బరువులెత్తడంలో ఆమెను మించినవారు లేరు. ప్రొఫెషనల్‌ కిక్‌బాక్సర్‌ నుంచి పవర్‌లిఫ్టర్‌గా మారి తన పవర్‌ను ప్రదర్శిస్తోంది. ప్రపంచ హెవీ పవర్‌లిఫ్టర్‌లలో ఆమె ఒకరు. ‘లేడీ హల్క్‌’గా పేరొందిన జాకీ కూర్న్‌ ప్రస్తుతం సోషల్‌మీడియా సెలబ్రిటీ.


ఇంతకీ ఆమె ప్రత్యేకతలేమిటంటే..

క్రీడా నేపథ్య కుటుంబం నుంచి వచ్చింది. ప్రొఫెషనల్‌ కిక్‌ బాక్సర్‌ కూడా. పదేళ్లకు పైగా అందులోనే కొనసాగింది. కానీ కరోనా ఒక్క సారిగా ఈమె జీవితాన్నే మార్చేసింది. ఆ సమయంలో కిక్‌ బాక్సింగ్‌ పోటీలు ఆగిపోవడంతో, పవర్‌ లిఫ్టింగ్‌ వైపు దృష్టి మరల్చింది. కేవలం రెండేళ్లలోనే 70 కిలోల నుంచి 159 కిలోల బరువు పెరిగి, వెయిట్‌ లిఫ్టింగ్‌పై పూర్తిగా పట్టు సాధించింది. ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌, జూడో లోనూ ప్రావీణ్యం ఉంది.


నెదర్లాండ్స్‌కు చెందిన ఈ లేడీ హల్క్‌ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఈమె బైసెప్స్‌ సైజు 24 అంగుళాలు(60 సెంటీమీటర్లు). దిగ్గజ బాడీ బిల్డర్‌, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ (55 సెంటీమీటర్లు) కండల సైజును ఈమె అధిగమించడం విశేషం.

పలు రియాలిటీ షోలు, స్థానిక ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకుంది. ఇటీవల నటనారంగంలోకి కూడా ప్రవేశించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ రెజ్లింగ్‌ పోటీలో పాల్గొని రోల్‌ మోడల్‌గా నిలవాలన్నదే ఈమె లక్ష్యం.

జాకీకి టాటూల పిచ్చి ఎక్కువే. ఆమె శరీరంపై 30కి పైగా టాటూలున్నాయి. చేతులు, కాళ్లు, వీపు మెడ.. ఇలా ఎక్కడ చూసినా టాటూలమయమే. ‘టాటూ తనకొక ఎమోషన్‌’ అని చెబుతుంది.


కూర్న్‌ అందానికి ఫిదా అయ్యే గత కొన్నాళ్లుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. కొందరు ఈమెను రియల్‌ లైఫ్‌ షీ- హల్క్‌ అంటూ పొగిడేస్తుంటారు. లవ్‌ ప్రపోజల్స్‌ గురించి అడిగితే... ‘అబ్బో చాలానే వచ్చాయి. కానీ వారంతా నా నేమ్‌, ఫేమ్‌ చూసి ఇష్టపడ్డవారే. నిజానికి నన్ను నన్నుగా అర్థం చేసుకుని, బోలెడంత ప్రేమను పంచే వ్యక్తి నా లైఫ్‌లో కూడా ఉన్నాడండోయ్‌’ అంటోందీ 35 ఏళ్ల భామ.

జాకీ కూర్న్‌ 450 కిలోల బరువును కాళ్లతో సునాయాసంగా లిఫ్ట్‌ చేయగలదు. బెంచ్‌ ప్రెస్‌ ద్వారా 200 కిలోలను అమాంతంగా పైకి ఎత్తేస్తుంది. స్క్వాట్స్‌, డెడ్‌లిఫ్ట్‌ ద్వారా 100 కిలోలు, 150 కిలోల బరువును కూడా ఇట్టే ఎత్తగలదు.

Updated Date - Jul 28 , 2024 | 10:57 PM

Advertising
Advertising
<