ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shiny Hair : లావెండర్ ఆయిల్ నుండి అర్గాన్ ఆయిల్ వరకు మెరిసే జుట్టు కోసం ఏది బెస్ట్..

ABN, Publish Date - Aug 14 , 2024 | 07:57 AM

కొందరు సహజమైన పద్దతుల్లో జుట్టుకు పోషణ అందించాలని తెగ తాపత్రయపడతారు. అసలు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే సహజమైన నూనెల గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది.

hair growth

జుట్టు అందంగా నిగనిగలాడుతూ కనిపించాలని ఆడవారందరికీ ఆశగా ఉంటుంది. దీనికోసం రకరకాల నూనెలు, షాంపూలను వాడుతుంటారు. కొందరు సహజమైన పద్దతుల్లో జుట్టుకు పోషణ అందించాలని తెగ తాపత్రయపడతారు. అసలు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే సహజమైన నూనెల గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. జుట్టు సహజంగా ఆరోగ్యంగా కనిపించడానికి ఏ నూనెలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులో ముఖ్యంగా..

లావెండర్ ఆయిల్..

లావెండర్ ఆయిల్ జుట్టుకు మంచి సంరక్షణను అందిస్తుంది. తలకు రక్తప్రసరణను అందించడంలోనూ, త్వరగా జుట్టు పెరిగేందుకు సహకరిస్తుంది. దీనిలో ప్రత్యేకంగా యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగకుండా ఆపుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుంది.

Health Tips : అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా.. ఇవి తింటే కీళ్ల నొప్పులు ఉండవా..!

పిప్పరమింట్ ఆయిల్..

పిప్పరమింట్ ఆయిల్ స్కాల్ప్‌ను ఉత్తేజపరిచేందుకు, జుట్టును పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. తలకు రక్తప్రవాహాన్ని పెంచడంలోనూ సహకరిస్తుంది. హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడంలో సహాయపడుతుంది. పిప్పర మింట్ ఆయిల్ ఆరోగ్యకరమైన జుట్టు పెరిగేందుకు, దురద, పొడిబారడం, ఉపశమనం కలిగిస్తుంది.


రోజ్మేరీ ఆయిల్..

రోజ్మేరీ నూనె వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇందులోని హెయిర్ ఫోలికల్స్‌కు రక్తసరఫరా లేకపోవడం, చనిపోవడం, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నూనె అకాల గ్రేయింగ్ చుండ్రును నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.

టీట్రీ ఆయిల్..

టీట్రీ ఆయిల్ శక్తివంతమైనది. జుట్టు పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Health Tips : శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !!

అర్గాన్ ఆయిల్

లిక్విడ్ గోల్డ్ అని పిలువబడే ఆర్గాన్ ఆయిల్..ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు, విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి జుట్టును హైడ్రేట్ చేయడానికి, మృదువుగా ఉంచేందుకు సహకరిస్తుంది.

జుట్టు కోసం ముఖ్యమైన నూనె..

కొబ్బరి నూనె, ఆలీవ్ ఆయిల్ వంటివి క్యారియర్ ఆయిల్ చుక్కలను మిక్స్ చేసి తలకు మసాజ్ చేసినా, కడిగే ముందు డీప్ కండిషనింగ్ కోసం కనీసం 30 నిమిషాలు ఉంచాలి. ఈ నూనెలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 14 , 2024 | 07:57 AM

Advertising
Advertising
<