ఎవరిల్లు వారికి గొప్ప
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:02 AM
అడవిలో ఉండే ఒక కొలను దగ్గర ఒక తాబేలు మరియు చిన్న పిట్ట ఒక దానికొకటి పరిచయం అయ్యాయి. ఆ తాబేలు పదేపదే తన గొప్పలు బయటకు చెబుతూ అందరినీ చిన్నబుచ్చుతూ ఉండేది. పిట్ట మాత్రం...
అడవిలో ఉండే ఒక కొలను దగ్గర ఒక తాబేలు మరియు చిన్న పిట్ట ఒక దానికొకటి పరిచయం అయ్యాయి. ఆ తాబేలు పదేపదే తన గొప్పలు బయటకు చెబుతూ అందరినీ చిన్నబుచ్చుతూ ఉండేది. పిట్ట మాత్రం అందరితో మర్యాదగా స్నేహంగా నడుచుకునేది. అలా అందరినీ మాటలతో ఇబ్బంది పెట్టవద్దని పిట్ట తాబేలుకు ఎన్నోసార్లు హితవు చెప్పడానికి ప్రయత్నించింది కానీ తాబేలు దాని మాటలు పెడచెవిన పెట్టేది. ‘అందరినీ అంటున్నది కానీ నన్ను ఏమీ అనదు తాబేలు’ అనుకున్నది పిట్ట. ఒక రోజు పిట్ట చెట్టు కొమ్మ మీద వాలి ఉండగా, కిందనుండి వెళు తున్న తాబేలు దాన్ని చూస, ‘ఏమీ అలా కూర్చున్నావు? నీకు ఇల్లు లేదా?నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టంమైన పని కదా. ఎవరినైన సాయం కూడా అడగాలి, అదే నా ఇల్లు చూడు, అదెప్పుడూ నా వీపునే ఉంటుంది.
నాకు ఏ ఇబ్బంది కలిగినా క్షణంలో అందులోకి దూరిపోతాను పాపం నీ పరిస్థితి’ అన్నది. ఆ మాటలకు నొచ్చుకున్న పిట్ట ‘నీ ఇంట్లో నువ్వు ఒక దానివే ఉండగలవు అదే నా ఇంట్లో అయితే నా కుటుంబం అంతా నాతోనే నివసంచవచ్చు. ఎవరి ఇల్లు వారికి గొప్ప కదా’ అన్నది.
Updated Date - Jul 14 , 2024 | 03:25 AM