ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Superfood : పోషకాల గని కోహ్లాబీ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా...!

ABN, Publish Date - Feb 26 , 2024 | 10:49 AM

కోహ్ల్రాబీలో ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును ఎదుర్కోవడానికి సహాయపడతాయి.

superfood

మనం తినే ఆహారంలో చాలా రకాల కూరగాయలు, పండ్లు గురించి మనకు పూర్తిగా తెలియదు. ఇందులో కొన్ని ఆహారాల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా సరిగ్గా తెలుసుకోము. కాస్త అరుదుగా ఉపయోగించే ఆహార పదార్ధాలలో కోహ్ల్రాబీ కూరగాయ అదే దుంప దీనిని, టర్నిప్ క్యాబేజీ లేదా జర్మన్ టర్నిప్ అని కూడా పిలుస్తారు, దీనిని తరచుగా మన వంటకాల్లో వాడకపోవచ్చు కానీ ఇందులోని పోషకాల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.., మంచి రుచితో, కోహ్ల్రాబీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాల నుండి జీర్ణ క్రియను మెరుగుపరిచేంత వరకూ ఈ సూపర్‌ఫుడ్‌ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఐదు అద్భుతమైన ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

పోషకాలు

కోహ్ల్రాబీలోని పోషకాల విషయానికి వస్తే ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫైబర్‌తో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మానికి ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు..

కోహ్ల్రాబీలో ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్‌లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆహారంలో కోహ్ల్రాబీని చేర్చుకోవడం ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి.

ఇది కూడా చదవండి: కంటి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

జీర్ణ ఆరోగ్యానికి..

అధిక ఫైబర్ కంటెంట్‌తో, కోహ్లాబీ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో అద్భుతమైనది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. సాధారణ ప్రేగు కదలికలకు ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..

బరువు

తక్కువ క్యాలరీలు, పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల అధిక కేలరీలు తీసుకోకుండా సహాయపడుతుంది. దీనిలోని అధిక నీటి కంటెంట్ మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కోహ్లాబీ రుచికరమైన, పోషకమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ బరువు తగ్గించుకోవచ్చు. కోహ్ల్రాబీ దీన్ని పచ్చిగా లేదా ఉడికించి, సలాడ్‌లలో సన్నగా ముక్కలు చేసి తీసుకోవచ్చు. సూప్‌లు స్టైర్-ఫ్రైస్‌లో కలిపినా, కోహ్ల్రాబీ ఆరోగ్యానికి మంచి పోషణను అందిస్తుంది.

Updated Date - Feb 26 , 2024 | 10:49 AM

Advertising
Advertising