Overdosing on Vitamins : విటమిన్లు ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారా? దీనితో కలిగే దుష్ప్రభావాలు తెలుసా..!
ABN, Publish Date - Feb 26 , 2024 | 12:49 PM
విటమిన్ సి, కాల్షియం వంటి కొన్ని విటమిన్లు, మినరల్స్ అధికంగా తీసుకోవడం వ్లల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. విటమిన్ సి, ఎక్కవ మోతాదులో తీసుకుంటే ఆక్సలేట్ గా మారవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్ కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
శరీరంలో అలసట, నీరసం, శక్తి స్థాయిలు తగ్గిపోవడం, విటమిన్స్ లోపం ఇలా చాలా కారణాలతో సపోర్ట్ కోసం విటమిన్స్ ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. విటమిన్లు మన శరీరాలను సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలు. ఇవి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీర్ణ అసౌకర్ంయ నుంచి అవయవ నష్టం కూడా కలవచ్చు. విటమిన్లను అధిక మోతాదులో తీసుకునే వారిలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే..
విటమిన్ టాక్సిసిటీ..
విటమిన్లను అధిక మోతాదులో తీసుకుంటే విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలోని కొవ్వు నిల్వలలో పేరుకుపోతాయి. కాల క్రమేణా అధికంగా వినియోగించినప్పుడు విష స్థాయిలను చేరుకుంటాయి. విటమిన్ విషపూరితంగా మారి వికారం, వాంతులు, తలనొప్పి తీవ్రమైన సందర్భాల్లో అవయవ నష్టం కూడా ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..
డైజెస్టివ్ డిస్ట్రెస్..
కొన్ని విటమిన్లు అధిక మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా విటమిన్ సి వంటి నీటిలో కరిగేవి. జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తాయి. విటమిన్ సి పెద్ద మొత్తంలో తీసుకుంటే అతిసారం, కడుపు నొప్పి, జీర్ణశయాంతర అసౌకర్యానికి దారితీస్తుంది.ఇటు వంటి సమస్యలను నివారించడానికి సప్లిమెంటేషన్తో జాగ్రత్తగా ఉండటం అవసరం.
కిడ్నీ స్టోన్స్..
విటమిన్ సి, కాల్షియం వంటి కొన్ని విటమిన్లు, మినరల్స్ అధికంగా తీసుకోవడం వ్లల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. విటమిన్ సి, ఎక్కవ మోతాదులో తీసుకుంటే ఆక్సలేట్ గా మారవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్ కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇది కూడా చదవండి: మన పెరిటి మొక్కే.. ఈ నీలం రంగులో ఎన్నో ప్రయోజనాలో..
నరాల నష్టం..
పిరిడాక్సిన్ అని కూడా పిలిచే విటమిన్ B6 అధిక మోతాదు తీసుకుంటే పెరిఫెరల్ న్యూరోపతి అనే నరాల దెబ్బతినే వ్యాధికి గురవుతారు. విటమిన్ B6 అధికంగా తీసుకుంటే జలదరింపు, తిమ్మిరి, అవయవాల బలహీనతకు కారణం అవుతుంది.
మందులతో..
కొన్ని విటమిన్లు, ఖనిజాలు మందులతో సంకర్షణ చెందుతాయి. విటమిన్ కె, విటమిన్ సి వంటి సప్లిమెంట్స్ మిగిలిన మందులతో కలిపి వేసుకోకపోవడం మంచిది. ఇవి వాటితో కలిసిపోయి ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇలా తీసుకునే విధానంలో డాక్టర్ సలహాను పాటించడం ముఖ్యం.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Feb 26 , 2024 | 12:51 PM