ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Alert: కంట్లో ఈ లక్షణాలు కనిపించాయా? నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించండి!

ABN, Publish Date - Feb 11 , 2024 | 09:23 PM

High BP Symptoms: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. ఊబకాయం, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ముఖ్యంగా రక్తపోటు పెరగడం ప్రమాదకరమైన పరిస్థితి.

High BP Symptoms

High BP Symptoms: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. ఊబకాయం, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ముఖ్యంగా రక్తపోటు పెరగడం ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల అనేక ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు పెరగడం వల్ల స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, శరీరంలో రక్తపోటు పెరిగితే.. అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే కనిపెట్టి.. వైద్యులకు చూపిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ఈ లక్షణాలు కళ్లలో కనిపిస్తాయి. మరి రక్తపోటు సమస్యను ముందే ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తపోటు వల్ల కళ్ళు ఎలా ప్రభావితమవుతాయి?

1. రక్తపోటు పెరుగుదల రెటీనాలో సమస్యలను కలిగిస్తుంది.

2. అధిక రక్తపోటు కళ్ల నరాలను దెబ్బతీస్తుంది.

3. అధిక బీపీ వల్ల రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డుపడవచ్చు.

హైబీపీ ఉన్నప్పుడు కళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయి?

డబుల్‌గా కనిపించడం: రక్తపోటు పెరిగినప్పుడు కళ్ళు డబుల్‌గా కనిపిస్తాయి. ఈ సమస్య వచ్చినట్లయితే విస్మరించకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చు. అదే సమయంలో కంటిపై ఎక్కువ దుష్ప్రభావం చూపదు.

మసక దృష్టి: అధిక రక్తపోటు కళ్లపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీనివల్ల చూపు మసకబారుతుంది. ఇలా అనిపించినట్లయితే.. డాక్టర్‌కు చూపించుకోవాలి. తద్వారా సమస్య నుంచి బయటపడొచ్చు.

తలనొప్పి: రక్తపోటు ఎక్కువగా పెరిగినప్పుడు.. కళ్ళ చుట్టూ నొప్పి, తీవ్రమైన తలనొప్పి ప్రారంభమవుతుంది. ఇది తీవ్రమైన లక్షణంగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 11 , 2024 | 09:23 PM

Advertising
Advertising