ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Women Health: ఈ గింజలు మహిళలకు వరం లాంటివి.. తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ABN, Publish Date - Feb 17 , 2024 | 02:05 PM

Pumpkin Seeds Benefits: మొలకలు, కొన్ని రకాల కాయల గింజలు వ్యక్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా.. మహిళల ఆరోగ్యానికి కొన్ని గింజలు చాలా ఉపయోగకరంగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గుమ్మడి గింజలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

Pumpkin Seeds Benefits

Pumpkin Seeds Benefits: మొలకలు, కొన్ని రకాల కాయల గింజలు వ్యక్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా.. మహిళల ఆరోగ్యానికి(Women Health) కొన్ని గింజలు చాలా ఉపయోగకరంగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గుమ్మడి గింజలు(Pumpkin Seeds) ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల(Health Experts) అభిప్రాయం ప్రకారం.. మహిళలకు గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని స్మూతీ, స్నాక్స్, అల్పాహారంగా గానీ తినొచ్చు. విటమిన్ ఇ తో పాటు ఫైబర్, ఐరన్, పొటాషియం కూడా ఇందులో ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గుమ్మడికాయ గింజలు తినడం వలన మహిళలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది..

గుమ్మడికాయ గింజలలో అధిక మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిండం అభివృద్ధిలో కూడా సహాయపడుతుంది. జింక్ నాడీ వ్యవస్థ అభివృద్ధికి కూడా చాలా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవాలి.

రక్తహీనత..

శరీరంలో హిమోగ్లోబిన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో రక్తం లోటు ఉండదు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు గుమ్మడి గింజలను తింటే ప్రయోజనం ఉంటుంది.

బలమైన ఎముకలు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 30 సంవత్సరాల వయస్సు తర్వాత ఎముకలు క్రమంగా బలహీనపడతాయి. అలాంటి సమయంలో ఎముకలు లేదా కీళ్ల నొప్పికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. గుమ్మడి గింజల్లో కాల్షియంతో పాటు విటమిన్ కె కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

బరువు తగ్గడం..

ఊబకాయం సమస్యతో బాధపడే స్త్రీలు గుమ్మడి గింజలను తప్పనిసరిగా తినాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ తినాలనే కోరిక తగ్గిపోయి అతిగా తినే సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఫలితంగా ఈజీగా బరువు తగ్గొచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2024 | 02:05 PM

Advertising
Advertising