Baobab Tree : ఈ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమే..! బాబాబ్ చెట్టుతో ఎంత ఆరోగ్యమంటే..
ABN, Publish Date - Feb 13 , 2024 | 01:30 PM
కడుపు సమస్యలకు, కీళ్ల వ్యాధులకు ఈ బాబాబ్ చెట్టు విత్తనాలనే వాడతారు.
ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మడగాస్కర్ వంటి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బాబాబ్ చెట్లు కనిపిస్తాయి. అక్కడే అధికంగా ఈ చెట్లు పెరుగుతాయి. వీటి శాస్త్రీయనామం అడాన్సోనియా. మామూలుగా వీటి ఎత్తు 70 అడుగులు పెరుగుతుంది. చుట్టుకొలత మాత్రం 35 మీటర్లు దాటి ఉంటుంది. ఆఫ్రికా ప్రజలు ఈ చెట్లనే ఇళ్ళుగా చేసుకుంటారు. వీటికి రుచికరమైన ఆరోగ్యవంతమైన సీట్రస్ పండ్లు కాస్తాయి. ఈ చెట్టు కాయలు, ఆకులు, గింజలు, బెరడు ఇలా అన్నీ ఔషద గుణాలు కలిగి ఉంటాయి. అంతేనా ఈ చెట్టు ఆకులను వంటలలో ఉపయోగిస్తారు. ఈ విత్తనాలతో నూనె తయారు చేస్తారు. ఈ పండు పండాకా తింటే చాలా సేపు ఆకలి వేయదు.
ఔషద ఉపయోగాలు..
ఈ చెట్టు ఆకులు యాంటిహిస్టామైన్, హైపోసెన్సిటివ్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బసం, మూత్రపిండాలు, మూత్రాశయ రుగ్మతలు, అలసట, అతిసారం వంటి వాటికి చికిత్సగా పనిచేస్తుంది. ఆకులు, పువ్వుల కషాయం కంటి చికాకును, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఇక కడుపు సమస్యలకు, కీళ్ల వ్యాధులకు ఈ బాబాబ్ చెట్టు విత్తనాలనే వాడతారు. ఈ చెట్టు బెరడును స్ట్రోఫాంథస్ విషానికి నివారిణిగా భావిస్తారు. ఆఫ్రికాలో, దీని గుజ్జును డయేరియాను నయం చేయడానికి, జ్వరాలకు చికిత్స చేయడానికి డయాఫోరేటిక్‌గా తరచుగా ఉపయోగిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి, బెరడు గమ్‌ను వాడతారు.
ఇది కూడా చదవండి; గార్డెన్ ఆకర్షణీయంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
ఈ చెట్టు భాగాల ఆకులు, పండ్లు ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఆకలిని మందగించేట్టుగా చేయగలిగే బాబాబ్ గుణం బరువుతగ్గడంలోనూ సహకరిస్తుంది. బాబాబ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దాదాపు 10 గ్రాముల బాబాబ్ పౌడర్ లో 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రోజుకు 14 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల కేలరీలు తీసుకోవడం 10 శాతం తగ్గుతుంది. అంటే నెలలో శరీర బరువు సగటున 1.9 కిలోలు తగ్గేందుకు అవకాశం ఉంది.
రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు..
బాబాబ్ పిండిని కలిపి రొట్టె తయారు చేయడం వల్ల ఇది అవసరమైన ఇన్సలిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
జీర్ణ ఆరోగ్యానికి..
బాబాబ్‌లోని ఫైబర్ వల్ల జీర్ణ ఆరోగ్యానికి మంచిది. బాబాబ్ చెట్టు మూలాలు, ఆకులు, పండ్లు, గింజలు, బెరడు, మొలకలు, పువ్వులు వంటి భాగాలు.. ఈ పక్వం చెందిన పండ్లలో రుచికరమైన తెలుపు పొడి గుజ్జు ఉంటుంది, ఇందులో విటమిన్లు సి, బి2 అధికంగా ఉంటాయి.
Updated Date - Feb 13 , 2024 | 01:31 PM