ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crunchy Poha Nuggets : పిల్లలకి నచ్చే పోహా నెగ్గెట్స్ తయారీ ఎంత ఈజీనో.. !

ABN, Publish Date - Feb 20 , 2024 | 01:57 PM

సాయంకాలం తినాలనుకునే స్నాక్స్ ఏవైనా రుచికరంగానే కాదు.. కాస్త ఈజీగా చేసుకునే విధంగా ఉంటే తినేందుకే కాదు.. రెసిపీ చేసేందుకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అలా ఈజీగా చేసుకునే స్నాక్స్ లో క్రిస్పీ డీలైట్ పోహా నగ్గెట్స్ వీటిని తయారు చేయడం చాలా ఈజీ.. ఇక రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.

Food Item

సాయంకాలం తినాలనుకునే స్నాక్స్ ఏవైనా రుచికరంగానే కాదు.. కాస్త ఈజీగా చేసుకునే విధంగా ఉంటే తినేందుకే కాదు.. రెసిపీ చేసేందుకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అలా ఈజీగా చేసుకునే స్నాక్స్ లో క్రిస్పీ డీలైట్ పోహా నగ్గెట్స్ వీటిని తయారు చేయడం చాలా ఈజీ.. ఇక రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారుచేసే పద్దతి, ఇందుకు కావాల్సిన పదార్థాలను చూద్దాం.

దీనికోసం కావాల్సిన పదార్థాలు..

కప్పు అటుకులు..

మీడియం సైజు బంగాళ దుంపలు

అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు

పావు కప్పు తరిగిన కొత్తిమీర తరుగు

ఒకటి రెండు పచ్చిమిర్చి ముక్కలు

ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

అర టీస్పూన్ పసుపు

ఒక టీ స్పూన్ కారం పొడి

అర టీస్పూన్ గరం మసాలా..

రుచికి ఉప్పు

డీప్ ఫ్రైకి నూనె

ఇది కూడా చదవండి : రంగులోనే కాదు.. పోషకాల్లోనూ భేష్.. పర్పుల్ క్యాబేజ్ తీసుకుంటే ఇన్ని ఉపయోగాలా.. !


తయారు చేసే పద్దతి..

అటుకులను కొద్ది సెకన్ల పాటు నీటిలో కడిగి తీయాలి. నీటిని పూర్తిగా తీసివేసి, పోహా మృదువుగా ఉండటానికి ఆరనివ్వాలి. పది నిమిషాల తర్వాత కాస్త కదిపి పక్కన పెట్టుకోవాలి. పెద్ద మిక్సింగ్ గిన్నెలో మెత్తగా చేసిన పోహా, మెత్తని బంగాళా దుంపలు, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి అల్లం తరుగు, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి మెత్తగా చేసి నీరు పోస్తూ ముద్దలా చేసుకోవాలి.

నగ్గెట్స్..

మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ చేసే విధానంలో ఇలాగే ఉండాలనేంలేదు. మనకు నచ్చిన విధంగా గుడ్రంగా, లేదా కోడిగుడ్డు ఆకారంలో నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మీడియం వేడి మీద ఉండలు వేసి గోధుమ రంగులోకి మారేంత వరకూ వేయించాలి. నూనె నుంచి తీసి గోరువెచ్చగా పుదీనా చట్నీతో సర్వే చేస్తే రుచిగా బావుంటాయి. వీటిని పిల్లలు పెద్దలూ అంతా ఇష్టంగా తింటారు.

Updated Date - Feb 20 , 2024 | 01:57 PM

Advertising
Advertising