ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sleep Duration : నిద్ర మరీ ఎక్కువైనా ఇబ్బందేనా.. షుగర్ పెరుగుతుందా ..!

ABN, Publish Date - Jul 23 , 2024 | 01:09 PM

పనిచేయలేనంత అలసట ఉంటుంది. వేగంగా కదలలేరు. తల మొద్దుబారిన ఫీలింగ్ ఉంటుంది.

Sleep

నిద్ర సరిగా లేకపోతే నిద్ర లేమి సమస్యలు వచ్చి పడతాయి. మరీ తక్కువగా నిద్ర కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది నిద్ర లేమి సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువే. నిద్ర విషయంలో మరీ ఎక్కువగా ఉన్నా కూడా సమస్యలు తప్పవట. కొందరు రోజులో ఎనిమిది గంటలు నిద్రపోయినా నిద్ర సరిపోనట్టు జోగుతూ ఉంటారు. ఇలాంటి వారి సంగతికి వస్తే..మరీ ఎక్కువగా వారం రోజుల పాటు నిద్రలోనే గడిపితే వీరికి టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఉంటుందట. అవును.. కొత్త అధ్యయనాలు ఇదే చెబుతున్నాయి. నిద్ర అలవాట్లు సరిగాలేకపోతే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకతప్పదట. అప్పటికే షుగర్ ఉన్నవాళ్ళలో అయితే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందట.

అతి నిద్ర అనేక రకాల దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రగ్మతగా మారుతుంది. రోజంతా హడావుడి పరుగుల మధ్య సరిగా నిద్రపోవడం అనేది పెద్ద సమస్యే. సగటు నిద్రా సమయం తరిగిపోతూ వస్తున్న పరిస్థితుల్లో మరీ ఎక్కువగా నిద్రపోతే కూడా సమస్యలు తప్పవట. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు నిద్రకు తగిన సమయం కేటాయించడం మంచిది. కానీ ఈ సమయం మరీ ఎక్కువైతే మాత్రం రకరకాల సమస్యలు తప్పవట.

ఒక వారం పాటు క్రమం తప్పని నిద్ర సమయాలు మధ్య వయస్కులు, వృద్ధులలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 34 శాతం పెంచుతాయట. కేవలం ఏడు రోజుల నిద్ర దీర్ఘకాలిక షుగర్ వంటి సమస్యలను పెంచే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు నిద్రపోతున్న వారిలో ఈ మధుమేహం సమస్య పెరిగే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటీస్ తగ్గించడానికి శరీరం సహజ సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించడం ద్వారా అస్థిరమైన నిద్ర వ్యవధి మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

Human brain : మానవ మెదడు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..!


రోజులో 8 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయే వారిలో బ్రెయిన్ స్ట్రాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

మరీ ఎక్కువగా నిద్రపోతే బరువు పెరగటం సమస్య ఎక్కువగా ఉంటుంది. గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Women Health : మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!

డిప్రెషన్, మానసిక సమస్యలు, గుండె కొట్టుకోవడంలో తేడాలు కనిపిస్తాయి.

పనిచేయలేనంత అలసట ఉంటుంది. వేగంగా కదలలేరు. తల మొద్దుబారిన ఫీలింగ్ ఉంటుంది.

స్త్రీలలో, పురుషుల్లో ఇద్దరిలోనూ సంతాన సాఫల్యత సమస్యలు వస్తాయి.

అతి నిద్ర నిద్రపోయే వారు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.



Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !

అతినిద్ర సమస్య నుంచి బయటపడాలంటే..

1. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.

2. సరైన జీవనశైలి కలిగి ఉండాలి.

3. నిద్ర సరైన సమయం కేటాయింటాలి.

4. వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి.

5. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే మద్యం, కెఫిన్ వంటి వాటిని తీసుకోకూడదు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 23 , 2024 | 01:09 PM

Advertising
Advertising
<