Asthma Symptoms : ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే ఎనిమిది ఆహారాలు ఇవే..
ABN, Publish Date - Feb 21 , 2024 | 12:51 PM
శ్యాస సమస్యల్లో చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఆస్తమా, దీనికి ఆహారంతో కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కొన్ని ఆహారాలు ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో పండ్లు, కూరగాయలు, బీటా కెరోటిన్, విటమిన్ ఇ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ కణాలను ఆపడానికి సహకరిస్తాయి. ఊపిరితిత్తులకు మంట చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆస్తమా ముప్పును తప్పించే ఆహారాలు తగినట్టుగా లేవు.
శ్యాస సమస్యల్లో చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఆస్తమా, దీనికి ఆహారంతో కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కొన్ని ఆహారాలు ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో పండ్లు, కూరగాయలు, బీటా కెరోటిన్, విటమిన్ ఇ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ కణాలను ఆపడానికి సహకరిస్తాయి. ఊపిరితిత్తులకు మంట చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆస్తమా ముప్పును తప్పించే ఆహారాలు తగినట్టుగా లేవు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వీలుగా పోషకాలను, విటమిన్లను తీసుకోవడం అవసరం.
విటమిన్ డి..
సూర్యరశ్మి నుంచి విటమిన్ డి ని పొందవచ్చు. కానీ కొన్ని ఆహారాలలో కూడా ఇది ఉంటుంది. సాల్మన్, స్వోర్డ్ ఫిష్ వంటి కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్ వీటిని ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి స్థాయిలు శరీరంలో తక్కువగా ఉంటే ఆస్తమా అటాక్ వచ్చే అవకాశం ఉంది.
గింజలు..
ఆస్తమాకు మంచివి విటమిన్ ఇ. ఇది బాదం, హాజెల్ నట్స్, పచ్చి గింజలలో ఉంటుంది. అలాగే బ్రోకలీ, కాలే, క్రూసిఫెరస్ కూరగాయలు, విటమిన్ ఇలో టోకోఫెరోల్ అనే రసాయనం ఉంది. ఇది దగ్గు, శ్వాసలో గురకను తగ్గించడంలో సహకరిస్తుంది.
డ్రైఫ్రూట్స్..
ఆస్తమా ఉన్నట్లయితే మాత్రం వీటి జోలికి అస్సలు పోకూడదు. వాటిలో డ్రై ప్రూట్స్ తినకూడదు. ఎండిన పండ్లలో సల్పైట్ లు కొందరికి ఈ పరిస్థితిని దిగజార్చవచ్చు. వీటికి బదులుగా తాజాపండ్లు, ఆరెంజ్, యాపిల్స్ వంటి పండ్లు ఆస్తమా ఇబ్బందిని తొలగిస్తాయి.
ఇది కూడా చదవండి: పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
బీన్స్..
కడుపు ఉబ్బినట్టుగా ఉండి, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. ఇది ఆస్తమా దాడిని పెంచుతుంది.
కాఫీ..
సాలిసైలేట్లు సహజంగా కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు, యాస్పిరిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మాత్రలలో సహజంగా ఉండే రసాయనాలు. వీటిని తీసుకునే చాలా మంది వ్యక్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.
ఆహారం..
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, గింజలతో వారానికి కనీసం రెండుసార్లు చేపలు, చికెన్ తినాలి. మాంసాన్ని తగ్గించి తీసుకోవాలి. వెన్నకు బదులుగా, ఆలివ్ లేదా కనోలా నూనెతో వేపాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..
చేప..
ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల గురించి, ముఖ్యంగా సాల్మన్, హెర్రింగ్, ట్యూనా, సార్డినెస్ వంటి కొవ్వు చేపలలో ఉంటుంది. అవి శరీరంలో IgE మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఆహార అలెర్జీలు..
ఆస్తమా ఉన్నట్లయితే ఫుడ్ అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. ఆహార ప్రతి చర్య వల్ల శ్వాసలో గురక, ఇతర ఆస్తమా లక్షణాలను కలిగిస్తుంది.
చాలా ఎక్కువ ఆహారం..
ఊబకాయం BMI 30 అంతకంటే ఎక్కువ ఉంటే ఉబ్బసం వచ్చే అవకాశం ఉంటుంది.
Updated Date - Feb 21 , 2024 | 12:51 PM