Ant in Your House : ఇలా చేస్తే చాలు ఇంట్లో చీమలు దెబ్బకు కనిపించవ్..!!
ABN, Publish Date - Mar 30 , 2024 | 11:37 AM
పెప్పర్ మింట్ నీటిని చల్లడం వల్ల చీమలు రావు. అలగే, ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం వల్ల చీమలు, దోమలు, పురుగుల్లాంటివి అటువైపు రావడం తగ్గుతాయి.
ఇళ్లల్లో చీమలతో పెద్ద సమస్యగానే ఉంటుంది. ఏ పదార్థాన్ని పెట్టినా ఐదు నిమిషాల్లో అక్కడకు చేరిపోతాయి. పాలు, పెరుగు, పంచదార, స్వీట్లు ఇలా ఏవి కనిపించినా సరే నిమిషాల వ్యవధిలోనే చీమలు వరుసలు కట్టేస్తుంటాయి. ఇవి కొన్ని రకాల బ్యాక్టీరియాల్ని మన ఆహారంలో చేర్చే ట్రాన్స్‌మిటర్లు గానూ పని చేస్తాయి. అంతే కాదు చీమల వల్ల వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
వీటిలో ముఖ్యంగా పరోహ్ యాంట్ అనే ఓ రకం చీమ వల్ల ఆస్తమా, శ్వాస కోస సంబంధమైన అలర్జీలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది. మామూలుగా ఇంట్లో చీమల బెడదను తట్టుకోలేక వీటిమీద రసాయనాలను ఉపయోగించి చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల కలిగే ముఖ్యమైన ఇబ్బందుల్లో మనకు శ్వాస ఇబ్బంది కలుగుతుంది. ఈ కెమికల్స్ వల్ల ఊపిరి ఆడకపోవడం, ఆ ఘాటు వాసనలను పీల్చడం వల్ల ఉక్కిరిబిక్కిరి కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక సహజ పద్దతుల్లోనే ఈసమస్యను తరిమికొట్టాలి.
వేప నూనె
వేప గింజల నుంచి తీసే వేప నూనె సహజమైన పురుగుల నివారిణిగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంట్లోనే కాకుండా, మొక్కలపై కూడా స్ప్రే చేయడానికి వాడవచ్చు. ఈ వేప నూనెను స్ప్రే చేయాలి. ఆ వాసనకు చీమలు తగ్గుతాయి.
మిరియాల పొడి, కారం
నల్ల మిరియాల పొడి, ఎర్ర కారం ఇవి రెండింటిలోనూ ఘాటైన వాసన ఉంటుంది. వంటగది మూలల్లో చల్లడం వల్ల బాగా పనిచేస్తుంది.
ఇవి కూడా చదంవండి:
వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..
పెప్పర్ మింట్
పెప్పర్ మింట్ నీటిని చల్లడం వల్ల చీమలు రావు. అలగే, ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం వల్ల చీమలు, దోమలు, పురుగుల్లాంటివి అటువైపు రావడం తగ్గుతాయి.
యూకలిప్టస్ ఆయిల్
లెమన్, యూకలిప్టస్ ఆయిల్ కలిపి చిలకరించినా చీమలు తగ్గుతాయి. నూనె చీమల బెడదను తగ్గించడంలో పనిచేస్తుంది.
ఉప్పు
ఉప్పు కూడా చీమల బెడదను తగ్గిస్తుంది. చీమలు ఉన్న ప్రదేశంలో ఉప్పును చల్లడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
దాల్చిన చెక్క
చీమలను వదిలించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క, లవంగం కలిపి చీమలు వచ్చే చోట ఉంచాలి. దీనివల్ల చీమల విషయంలో తగ్గే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 11:42 AM