ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Soy Candles : సోయా క్యాండిల్ ఎంత స్పెషల్ అంటే.. !

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:14 PM

సోయా మైనం అనేది సోయాబీన్ మొక్కల నుంచి సేకరించిన స్వచ్ఛమైన సహజమైన మైనం. ఇది మానవ శరీరానికి హాని కలిగించని విధంగా ఉంటుంది. ధర కూడా తక్కువ, రంగు కూడా మారదు.

soy candle

పుట్టిన రోజు, పండుగలు, ప్రత్యేక ఫంక్షన్లు ఇలా సందర్భంతో సంబంధం లేకుండా క్యాండిల్ వెలిగించడం పరిపాటి. చాలా వరకూ కరెంట్ పోయినప్పుడు కూడా కొవ్వొత్తి వెలిగిస్తాం. కానీ ప్రత్యేకంగా వెలిగించే క్యాండిల్స్ విషయానికి వస్తే వీటిలో బోలెడు రకాలున్నాయి. సోయా క్యాండిల్స్, సెంట్ సువాసనలతో రూమ్ అందాన్నే కాదు, ఆహ్లాదకరమైన సువాసనతో మనసును తేలికచేసేస్తాయి. ఖరీదులో కూడా మన క్యాండిల్స్‌కి కాస్త దగ్గరలోనే ఉంటాయి. ఈ చిన్న జార్స్ క్యాండిల్స్ చూసేందుకు ముచ్చటగా, ముద్దుగా ఉంటాయి. వీటి గురించి మరింత తెలుసుకుందాం.

సోయా మైనం అనేది సోయాబీన్ మొక్కల నుంచి సేకరించిన స్వచ్ఛమైన సహజమైన మైనం. ఇది మానవ శరీరానికి హాని కలిగించని విధంగా ఉంటుంది. ధర కూడా తక్కువ, రంగు కూడా మారదు. ఈ కొవ్వొత్తుల సవాసనలు అరోమా థెరపీ, రిలాక్సేషన్, ఒత్తిడిని తగ్గించడం, ధ్యానం, మూడ్ పీస్ కోసం సరిగ్గా సరిపోతాయి.

ఇది దోమలు, యాంటీ బాక్టీరియల్ , పురుగులను తిప్పి కొడుతుంది. చిరాకు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి, తలపోటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీనితో ఎలాంటి శ్వాసకోశ, నాసికా అలెర్జీలు, ఆస్తమా ఇతర సమస్యలు రావు. ఈ కొవ్వొత్తి వెలిగించినప్పుడు పొగ రాదు.

Health Tips : వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఎన్ని లాభాలో..


సోయా కొవ్వొత్తులు మామూలుగా మనం వాడే కొవ్వొత్తులకు వీటికీ మధ్య ఏం తేడా ఉంటుంది అన్నీ ఒకటే కదా అనుకోవచ్చు. ఈ కొవ్వొత్తులు మసిని ఇవ్వవు. జంతు ఉత్పత్తులతో తయారు చేసిన కొవ్వొత్తుల కంటే సోయా కొవ్వొత్తులు ఎక్కువసేపు ఉంటాయి.

ఇవి అందం విషయంలో పారాఫిన్ కొవ్వొత్తుల కంటే అందంగా ఉంటాయి. వీటిని అందమైన ఆకారాల్లో బహుమతుల్లా తయారుచేస్తారు. గిప్ట్ ఐటమ్స్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. సోయా కొవ్వొత్తిని స్టైల్‌కు తగినట్టుగా మార్చుకోవచ్చు.

Health Tips : క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే రెడ్ ముల్లంగి


ఎలా తయారు చేస్తారంటే.

గాజు గిన్నెలో సోయా మైనం వేసి వేడి నీటిలో ఈ మైనాన్ని ఉంచాలి. డైరెక్ట్‌గా మంట మీద ఉంచకూడదు. అప్పుడప్పుడూ కదిలిస్తూ ఉండాలి. మైనాన్ని చిన్న గాజు కూజాలలో వేయాలి.ఈ కరిగిన మైనానికి కొద్దిగా సువాసనకోసం ప్లేవర్స్ కలిపితే క్యాండిల్ వెలుగుతున్నంత సేపూ మంచి వాసన చుట్టూ అల్లుకుంటుంది.

కంటైనర్ మధ్యలో చిన్న మైనం ఒత్తిని ఉంచాలి. మైనపు గట్టిపడే వరకు ఉంచాలి. కంటైనర్ కదిలించకుండా అలాగే ఉంచాలి. మరిసటి రోడు ఒత్తిని కొద్దిగా కత్తిరించాలి. ఈ క్యాండిల్స్ ఫంక్షన్స్, పెద్ద మాల్స్, ఏదైనా వేడుకల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 15 , 2024 | 01:14 PM

Advertising
Advertising
<