ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fridge: మీకూ ఫ్రిడ్జ్ పైన వస్తువులు ఉంచే అలవాటు ఉందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!

ABN, Publish Date - Jul 01 , 2024 | 06:50 PM

చాలా వరకు ఇళ్లలో గమనిస్తే ఫ్రిజ్ మీద కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఫ్రిజ్ మీద వస్తువులు ఉంచడం మంచిదేనా?

రిఫ్రిజిరేటర్ ప్రస్తుతం అన్ని తరగతుల ఇళ్లలోనూ ఉంటోంది. కూరగాయలు, పాలు, పెరుగు నుండి చాక్లెట్లు, డ్రింక్స్, కూరలతో సహా చాలా రకాల ఆహార పదార్థాలు ఫ్రిజ్ లో ఉంటాయి. అయితే ఎప్పుడూ ఫ్రిజ్ లో ఏ ఆహారాలు ఉంచాలి? ఏవి ఉంచకూడదు అని తెలుసుకోవడమే కానీ ఫ్రిజ్ పైన ఉంచకూడదని వస్తువుల ఏంటి? అనే విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. చాలా వరకు ఇళ్లలో గమనిస్తే ఫ్రిజ్ మీద కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఫ్రిజ్ మీద వస్తువులు ఉంచడం మంచిదేనా? షాకింగ్ నిజాలు తెలుసుకుంటే..


మొక్కలు..

చాలామంది ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలను ఇంట్లో టేబుళ్ల మీద, ఫ్రిజ్ మీద ఉంచుతుంటారు. అయితే వెదురు మొక్కను ఫ్రిజ్ మీద ఉంచకూడదట.


ట్రోఫీలు..

ఏదైనా పోటీలో లేదా ప్రతిభకు గుర్తింపుగా ట్రోఫీ వస్తే దాన్ని ఇంటికి వచ్చిన వారికి కనిపించేలా పెట్టడం అందరికీ అలవాటు. అయితే ఇలాంటి ట్రోఫీలు ఫ్రిజ్ మీద అస్సలు పెట్టకూడదట.


చేపల అక్వేరియం..

ఇల్లు అందంగా కనిపించేందుకు చాలా మంది చేపల అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటారు. అయితే చేపల అక్వేరియంను ఫ్రిజ్ పైన పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. ఒక వేళ ఉంచితే అక్వేరియంలో చేపలు తొందరగా చనిపోతాయి.


మందులు..

రెగ్యులర్ గా ఉపయోగించే మందులను ఫ్రిజ్ మీద ఉంచడం కొందరి అలవాటు. ఫ్రిజ్ లో నుంచి నీటిని తీసుకుని వాటిని మందులను అక్కడికక్కడే వేసుకుంటూ ఉంటారు. అయితే ఫ్రిజ్ మీద మందులు ఉంచితే ఫ్రిజ్ వేడి కారణంగా మందుల పవర్ తగ్గిపోతుంది.


డబ్బు, బంగారం..

కొందరు ఫ్రిజ్ పైన డబ్బు, బంగారం పెడుతుంటారు. అయితే ఇలా డబ్బు, బంగారం ఫ్రిజ్ పైన ఉంచితే ఆ ఇంట్లో అర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందట. లాజిక్ గా ఆలోచిస్తే డబ్బు, బంగారం వంటి విలువైనవి అలా ఓపెన్ గా పెట్టడం వల్ల ఇంటికి ఎవరైనా వస్తే వారి చేతుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇది నష్టాన్ని కలిగిస్తుంది.

Updated Date - Jul 01 , 2024 | 06:50 PM

Advertising
Advertising