ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Clothes : దుస్తులపై మరకలు పోవాలంటే ఈ ట్రిక్స్ ప్రయత్నించండి.. !

ABN, Publish Date - Apr 03 , 2024 | 03:57 PM

పండ్ల రసాలు, కాఫీ, గ్రీజు, నూనె మరకలు ఓ పట్టాన వదిలిపోవు. వీటికోసం చాలా సమయాన్ని వెచ్చించాలి. పండ్ల రసాల మరకలు కనుక దుస్తులపై పడితే వాటిని నేరుగా వదిలించుకోలేం. సర్ఫ్‌కి కూడా లొంగదు.

Clothes

చాలా ఇష్టంగా కొనుక్కున్న డ్రస్ ( Clothes )ఎన్నో రోజులు వేసుకోకముందే దానిమీద కాఫీనో, పచ్చడో ఒలికిందనుకోండి.. ఇంకేముంది ఆ మరకపోయి మునుపటిలా మెరుస్తూ ఆడ్రస్ కనిపించదని ఫిక్స్ అయిపోతాం. నిజానికి అదే జరిగేది. ఎన్ని వేసి రుద్దినా కూడా దుస్తుల మీద మరకలు పోవు. మరక పడకుండా ఉండాలే కానీ, పడిందా ఇక అంతే సంగతులు. ఇలా ఎన్నో ఇష్టమైన డ్రస్‌లను వాడకుండా మూలన పెడుతుంటాం. అయితే అసలు దుస్తుల మీద మరకలు పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే బోలెడు ఉపాయాలు పుట్టుకొస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో...

పండ్ల రసాలు, కాఫీ, గ్రీజు, నూనె మరకలు ఓ పట్టాన వదిలిపోవు. వీటికోసం చాలా సమయాన్ని వెచ్చించాలి. పండ్ల రసాల మరకలు కనుక దుస్తులపై పడితే వాటిని నేరుగా వదిలించుకోలేం. సర్ఫ్‌కి కూడా లొంగదు. మరి వీటి మీద వెనిగర్ ఉపయోగించి చూడండి. చక్కని ఫలితం ఉంటుంది. డిటర్జెంట్ నీటిలో కాసేపు నాననిచ్చి, ఆపైన ఉతికితే మరకలు మాయం.

గ్రీజ్, నూనె మరకలు..

దుస్తుల(Clothes)పై లిప్ స్టిక్ మరక పడితే దానిపై కాస్త గ్లిజరిన్ రాసి అరగంట తర్వాత ఉతకాలి. ఇలా చేయడం వల్ల మరక ఇట్టే పోతుంది.

ఒక నిమ్మకాయ ముక్కను మరకపై రుద్దడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఫాబ్రిక్ రంగును కూడా సంరక్షిస్తుంది.


వేసవిలో చర్మాన్ని జిడ్డు, చికాకు నుంచి కాపాడాలంటే.. ఇలా చేయండి చాలు..!

హైడ్రోజన్ పెరాక్సైడ్ రక్తం లేదా తుప్పు మరకలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది కనుక ఇది ఫాబ్రిక్ రంగును కోల్పోయేలా చేస్తుంది. ఇది తెల్లటి బట్టపై చక్కగా పనిచేస్తుంది.

డిటర్జెంట్, స్టెయిన్ రిమూవర్ బట్టలు ఉతకడానికి ముందు మరకలను స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు. స్టెయిన్ రిమూవర్లు మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

దుస్తులపై ఇనుప తుప్పు మరక పడితే అర బకెట్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి ఉప్పు వేసి నానబెట్టాలి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఈ మరకల వేసి బాగా కలిపి డిటర్జెంట్ సబ్బుతో ఉతకాలి.

దుస్తులపై కెచప్ మరక పడితే, దాన్ని డిటర్జెంట్‌తో ఉతికితే సరిపోతుంది. బ్రష్‌ని ఉపయోగించి మరక ఉన్నచోట రుద్దితే మరక వెంటనే తొలగిపోతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 03:57 PM

Advertising
Advertising