Stove Burners : స్టవ్ బర్నర్స్ ఇంత ఈజీగా క్లీన్ చేయచ్చని తెలుసా.. ఇలా ప్రయత్నించి చూడండి.
ABN, Publish Date - Apr 24 , 2024 | 05:03 PM
గ్యాస్ స్టవ్‌లపై ఉన్న బర్నర్స్ శుభ్రం చేయడం అనేది అస్తమానూ చేస్తున్నా కూడా మళ్లీ వంట చేసే సరికి వాటికి అదే మకిలి పట్టుకుంటుంది. లేదా నీళ్ళు, సబ్బు, సర్ఫ్ వంటివి బర్నర్ లోపలికి వెళ్ళి మంట వచ్చే దారులుకు అడ్డం పడతాయి.
ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసే వారు. కాలంతో నెమ్మదిగా కిరోసిన్ స్టన్, తర్వాత గ్యాస్ వంటి సదుపాయాలు వచ్చాయి. వంట చేసే గది, వంటే స్టవ్ శుభ్రంగా ఉంటేనే తినే ఆహారం కూడా శుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యానికి కారణం అవుతుంది. లేదంటే తినే పదార్థాలలో నాణ్యత ఉన్నా, పరిసరాలు సరిగా లేనప్పుడు అనారోగ్యాలు తప్పవు. వారంలో రెండు సార్లు స్టవ్ క్లీన్ చేసినా మళ్ళీ వంట చేయగానే అదే స్థితిలోకి వచ్చేస్తుంది స్టవ్.. పెద్ద వంట చేసినా చిన్న వంట చేసిన వంటగదిలో స్టవ్ బర్నర్స్ చిరాగ్గా తయారయిపోతాయి. వెంట వెంటనే వాటిని క్లీన్ చేయాలంటే పెద్ద పనిలా అనిపిస్తుంది. వారంలో ఏదో ఒకరోజు పెట్టుకుని క్లీన్ చేసినా మళ్ళీ అదే నూనె మరకలు, జిడ్డు, పదార్థాలు పొంగి పొర్లిన చారలు పడుతూ చికాకు తెప్పిస్తాయి. ఈ పరిస్థితిని దాటాలంటే వంటగదిలో ఈ చిట్కాలు పాటించాల్సిందే. అవేమిటంటే..
గ్యాస్ స్టవ్‌లపై ఉన్న బర్నర్స్ శుభ్రం చేయడం అనేది అస్తమానూ చేస్తున్నా కూడా మళ్లీ వంట చేసే సరికి వాటికి అదే మకిలి పట్టుకుంటుంది. లేదా నీళ్ళు, సబ్బు, సర్ఫ్ వంటివి బర్నర్ లోపలికి వెళ్ళి మంట వచ్చే దారులుకు అడ్డం పడతాయి.దీనితో మంట సరిగా రాక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
1. గ్యా స్ శుభ్రం చేసేటప్పుడు మంటను ఆఫ్ చేసి, LPG ఆఫ్ చేసి అప్పుడు ఆఫ్ పొజిషన్ లో ఉంచి శుభ్రం చేయాలి. బర్నర్ క్యాప్స్ తీసేయాలి.
Liver Health : కాఫీ తాగి లివర్ కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టండి..!
2. నాన్ బ్రాసివ్ స్క్రబ్బింగ్ ప్యాడ్, క్లాత్, సబ్బు ఉపయోగించి బర్నర్లను క్లీన్ చేయాలి. పైన ఉండే స్టీల్ ప్లేట్స్ ని కనీసం ఇరవై నిమిషాల పాటు వేడి నీటిలో సర్ఫా వేసి నానబెట్టాలి.
3. ఒక భాగం నీరు, మూడు భాగాల బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి దానిని స్టవ్ చుట్టూ అప్లై చేసి 20 నిమిషాల తర్వాత స్పాంజ్‌తో తుడిస్తే సరిపోతుంది.
4. నాన్ బ్రాసిన్ స్ర్కబ్బింగ్ ప్యాడ్ తో తుడవడం వల్ల ఈజీగా స్టవ్ క్లీన్ అవుతుంది. అయితే ఎక్కువ సేపు ఎండలో ఆరనిచ్చి అప్పుడు స్టవ్ మళ్ళీ బిగించాలి. లేదంటే మంట సరిగా రాకపోవడం, స్టవ్ పాడు కావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
5. కొద్దిగా నిమ్మరసం, వెనిగర్ సాయంతో కూడా త్వరగా క్లీన్ చేయచ్చు.
6. ఇనో ప్యాకెట్ తో కూడా స్టవ్ క్లీనింగ్ చేయచ్చు..
7. రాత్రి స్టవ్ బర్నర్స్ నీటిలో నానబెట్టి కాస్త ఉప్పు, వెనిగర్, నిమ్మరసాన్ని వేసి ఉంచి ఉదయం చిన్న బ్రష్ సాయంతో క్లీన్ చేస్తే సరి.
Read Latest Navya News and Thelugu News
Updated Date - Apr 24 , 2024 | 05:03 PM