Skin Care : చర్మం పొడిబారుతుంటే దానికి కారణాలు, నివారణలు ఇవిగో...!
ABN, Publish Date - Aug 14 , 2024 | 01:53 PM
డీహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ చేయడానికి పుష్కలంగా నీరు తాగాలి. హైలురోనిక్ యాసిజ్, గ్లిజరిన్, అలోవెరా వంటి పదార్థాలను హైడ్రేటింగ్ చర్మ సంరక్షణలో ఉత్పత్తులుగా ఉపయోగించాలి. చర్మం తేమకు అవరోధాన్ని కలిగించే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
ముఖం నిగారింపుతో, మృదువుగా కనిపించాలని అందరూ తాపత్రయపడుతుంటారు. అందం పెంచుకునేందుకు రకరకాల ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అందరి చర్మం తీరు ఒకే మాదిరిగా ఉండదు. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన చర్మం కలిగి ఉంటారు. ఒకరి చర్మం పొడి బారినట్టుగా ఉంటే కొందరిలో జిడ్డు చర్మం ఉంటుంది. సహజంగా మంచి ఆరోగ్యకరమైన చర్మం ఉన్నవారు సౌందర్యాన్నిపెంచే ఉత్పత్తుల కారణంగా ముఖచర్మం పొడిబారినట్టుగా, నిర్జీవంగా మారుతుంది దీనికి సరైన చికిత్సను తెలుసుకుందాం.
పొడిగా, నిర్జీవంగా ఉన్న చర్మానికి సహజమైన నూనెలు లోపించడమే అసలైన కారణం, ఈ పరిస్థితికి పర్యావరణ కారకాలు కావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం, కఠినమైన చర్మ ఉత్పత్తులను ఉపయోగించడం వంటి కారణాలతో పొడి బారడం, జిడ్డుగా మారుతుంది. డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది.
పొడి చర్మం లక్షణాలు..
పొడిగా చర్మం బిగుతుగా మారినపుడు చర్మం పొరలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చర్మం బూడిద రంగులో కనిపిస్తుంది.
Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!
పొడి చర్మాన్ని తగ్గించడానికి, సహజ నూనెలను తిరిగి నింపడం పై దృష్టి పెట్టాలి. అలాగే సిరామైడ్స్, ఫ్యాటీ యాసిడ్, సహజ నూనెలు వంటి పదార్థాలతో సమృద్ధిగా పోషణ నిచ్చే మాయిశ్చరైజర్ లను ఉపయోగించాలి. మితిమీరిన క్లెన్సర్ లను తగ్గించాలి. ఇది చర్మం సున్నతత్వాన్ని, తేమను తగ్గిస్తుంది. క్లెన్సర్ ఉపయోగించేటట్టయితే సున్నితంగా, తేమను పెంచే వాటిని ఎంచుకోవాలి.
చర్మం బిగుతుగా..
డీహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ చేయడానికి పుష్కలంగా నీరు తాగాలి. హైలురోనిక్ యాసిజ్, గ్లిజరిన్, అలోవెరా వంటి పదార్థాలను హైడ్రేటింగ్ చర్మ సంరక్షణలో ఉత్పత్తులుగా ఉపయోగించాలి. చర్మం తేమకు అవరోధాన్ని కలిగించే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
Shiny Hair : లావెండర్ ఆయిల్ నుండి అర్గాన్ ఆయిల్ వరకు మెరిసే జుట్టు కోసం ఏది బెస్ట్..
డీహైడ్రేషన్ చర్మం లోపలి నుంచి హైడ్రేట్ చేయడానికి చికిత్స చేస్తుంది. దీనికి పుష్కలంగా నీరు తాగాలి. హైలురోనిక్ యాసిజ్, గ్లిజరిన్, అలోవెరా వంటి పదార్థాలను హైడ్రేటింగ్ చర్మ సంరక్షణలో ఉత్పత్తులుగా ఉపయోగించాలి. చర్మం తేమకు అవరోధాన్ని కలిగించే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
తేడా ఎలా గుర్తించాలి..
చర్మం ఎప్పుడూ బిగుతుగా, పొట్టు లేస్తున్నట్టుగా అనిపిస్తే మాత్రం పొడి చర్మం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో డీహైడ్రేట్ కావచ్చు. బాగా నీటిని తీసుకోవాలి. దానితో పాటు సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను తగ్గించాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 14 , 2024 | 01:54 PM