ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

keep private in life : జీవితంలో గోప్యంగా ఉంచుకోవాల్సిన ఐదు విషయాలు ఏంటో తెలుసా..!

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:58 AM

జీవితంలో చాలా విషయాలను ఇతరులను నమ్మి పంచుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మానసికంగా ఓ ప్రశాంతత వస్తుందని, మనసు తేలిక అవుతుందని మనం నమ్మిన వారితో పంచుకుంటే సాత్వంతన కలుగుతుందని నమ్ముతాం.

personal life

జీవితంలో చాలా విషయాలను ఇతరులను నమ్మి పంచుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మానసికంగా ఓ ప్రశాంతత వస్తుందని, మనసు తేలిక అవుతుందని మనం నమ్మిన వారితో పంచుకుంటే సాత్వంతన కలుగుతుందని నమ్ముతాం. ఎంత ప్రాణమిత్రులు, బంధువులైనా వారితో కొన్ని విషయాలను పంచుకోకూడదు. మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల వారితో ఓ దగ్గరితనం వస్తుంది. అయితే ఇదే విషయాలను వారు ఉపయోగించుకుని మనల్ని బ్లాక్ మెయిల్ చేసే వరకూ పరిస్థితి వెళ్ళవచ్చు. కాబట్టి గోప్యత చాలా అవసరం. ఏ విషయాల్లో గోప్యత అవసరం అంటే..

వ్యక్తిగత జీవితం గురించి...

జీవితంలోని సన్నిహిత వివరాలను పంచుకోవడం వలన తీర్పు, విమర్శలు మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. అనవసరమైన ఒత్తిడి, ఆందోళన నుండి రక్షించుకోవచ్చు. భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాల్సిన విషయాలను వేరే వారితో పంచుకోకూడదు. మన విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేయడం, ఇబ్బందులకు గురిచేయడం వంటి సమస్యలతో బలవంతంగా ప్రాణాలు తీసుకునే వరకూ రావచ్చు.

భద్రత..

ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోవకపోవడం మంచిది. మన పొదుపు, అప్పులు వంటి ఆర్థికపరమైన విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆదాయం ఖర్చులు విషయాలు, మన సాంకేతిక మాధ్యమాల డేటాను ఇతరులకు పంచకపోవడం మంచిది. పాస్వర్డ్స్, భధ్రతా నెంబర్ల విషయాలు, ఆన్ లైన్ గోప్యత చాలా అవసరం. లేదంటే ఇది ఆందోళనకు దారితీస్తుంది. ఇతరులతో ఈ వివరాలు పంచుకోకపోతే మన డేటాను దొంగిలించడం, సైబర్ స్టాకింగ్, ఇతర ఆన్లైన్ మోసాలను తగ్గించవచ్చు. ఇవే కాదు వైద్య పరీక్షలు, చికిత్సల విషయాలు కూడా ఇతరులతో చెప్పకూడదు. సంబంధ సమస్యలు, భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు, లక్ష్యాల గురించి పంచుకోకూడదు.

Health Tips : రంగు మారిన గోళ్లు మన అనారోగ్యాన్ని ఇట్టే చెబుతాయట.. ! అదెలాగంటే..


పోలిక వద్దు..

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లో జీవితాలను ఇతరులతో పోల్చుకునే ఉచ్చులో పడటం చాలా సులభం. వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచుకున్నప్పుడు టెంప్టేషన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టే..

అపార్థాలు తగ్గుతాయి.

జీవితంలో ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం వల్ల అపార్థాలకు, తప్పుడు ఆలోచనలకు దారితీస్తుంది. ప్రియమైన వారి విషయాలను ఇతరులకు చెప్పకూడదు.

సంబంధాన్ని ప్రత్యేకంగా..

గోప్యంగా ఉండటం ఓ బంధంలో ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పెంచి, నమ్మకం, సాన్నిహిత్యం పెంచుతుంది.


Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!

ప్రశాంతమైన మనస్సు..

వ్యక్తిగత జీవితంలో విషయాల్లో ఆసక్తి చూపించి, వారి విషయాలను తెలుసుకోవడం కూడా ఆపాలి. చాలా విషయాల్లో మనల్ని మనం కాపాడుకోవడమే కాదు. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడకపోవడం కూడా చాలా చిక్కుల నుంచి రక్షిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, స్నేహంలో హద్దుల్ని పాటించడం.. బంధాలను ఎక్కువ కాలం నిలిచేలా చేస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 23 , 2024 | 11:58 AM

Advertising
Advertising