Summer Plants : వేసవిలో మొక్కలు పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరి..!
ABN, Publish Date - Mar 30 , 2024 | 02:08 PM
మొక్కలకు పుష్కలమైన నీరు, ఎరువులు, మట్టి బలం చాలా ముఖ్యం, అలాగే కలుపు మొక్కలను కూడా తీసివేస్తూ ఉండాలి. మొక్కలకు ఉపయోగించే వర్మీ కంపోస్ట్ కూడా మొక్కకు బలాన్ని ఇస్తుంది. నీటి సంరక్షణ కూడా మెరుగుపడుతుంది.
శీతాకాలం మారి వేసవి (Summer)లోకి అడుగుపెట్టామంటే మనతోపాటు పసుపక్షాదులు, మొక్కలు (Plants) కూడా వేడికి తట్టుకోవడం కష్టం. వేసవిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలానే మొక్కలకు కూడా తగిన సంరక్షణ అవసరం. దీనికోసం ఏం చేయాలంటే..
వేసవి వేడి, పెరిగిన బాష్పీభవనం కారణంగా నేల పొడిగా మారుతుంది. పెద్ద మొక్కలు నేల లోతైన పొరల నుండి నీటిని పీల్చుకోవడానికి లోతైన మూలాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, మొక్కలు వడిలిపోయినట్టుగా నీరు అందనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. పైకి ఆరోగ్యంగా కనిపించినా నాలుగురోజుల్లోనే వడిలిపోతూ కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఒకటి మొక్కలకు సరైన నీరు అందకపోవడం లేదంటే మట్టి వేర్లకు సరిగా బలాన్ని ఇవ్వకపోవడం కావచ్చు. పోషకాలు అందకపోయినా ఇలా మొక్కలు వడిలిపోతూ ఉంటాయి.
మొక్కలకు పుష్కలమైన నీరు, ఎరువులు, మట్టి బలం చాలా ముఖ్యం, అలాగే కలుపు మొక్కలను కూడా తీసివేస్తూ ఉండాలి. మొక్కలకు ఉపయోగించే వర్మీ కంపోస్ట్ కూడా మొక్కకు బలాన్ని ఇస్తుంది. నీటి సంరక్షణ కూడా మెరుగుపడుతుంది. ఇది నీటిని పీల్చుకుని వేసవి వేడిలో వేర్లకు అందిస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదంవండి:
వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..
కలుపు మొక్కలు ఉపయోగకరమైన మొక్కలతో వనరుల కోసం పోటీపడతాయి. తెగుళ్లు, వ్యాధులను కలిగిస్తాయి. ఇవి మొక్కల బలాన్ని తీసుకుని పెరుగుతాయి. ఇది వాటి ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపుతుంది. దీనిని తగ్గించుకోవాలి.
చిన్న కుండలను ఉపయోగిస్తుంటే, కుండీలకు వేడి తగలకుండా ఉండే విధంగా సిమ్మెంట్ కుండీల కంటే కూడా మట్టి కుండీలను ఉపయోగించడం ముఖ్యం. ఇవి వేడిని మొక్కకు, వేర్లకు తగలకుండా చూస్తాయి.
సూర్యకాంతి మొక్కలలో శక్తికి మూలం. కొన్ని పువ్వులకు రోజుకు చాలా గంటలు సూర్యరశ్మి అవసరం అవుతుంది. మరికొన్ని వాటికి ఇండోర్‌ల మాదిరిగానే, కేవలం రెండు గంటలు మాత్రమే అవసరం అవుతుంది. మొక్కలు ఎక్కువ కాలం ప్రత్యక్ష సూర్యకాంతిని తట్టుకోలేకపోతే వీటికి రక్షణగా కంచెను ఏర్పాటు చేయడం ముఖ్యం.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 02:08 PM