ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jeans : జీన్స్‌.. జాలీగా..

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:39 AM

జీన్స్‌ డ్రస్సుల్లో ఉండే సౌకర్యం అంతా ఇంతా కాదు. ఎంచుకోడానికి వీలున్నన్ని మోడల్స్‌ జీన్స్‌లో ఉంటాయి. అలాగని కంటికి నచ్చింది కొనేసుకోకుండా, ట్రెండ్‌కు తగిన జీన్స్‌ డ్రెస్‌ ఎంచుకోవడం మీద దృష్టి పెట్టాలి.

జీన్స్‌ డ్రస్సుల్లో ఉండే సౌకర్యం అంతా ఇంతా కాదు. ఎంచుకోడానికి వీలున్నన్ని మోడల్స్‌ జీన్స్‌లో ఉంటాయి. అలాగని కంటికి నచ్చింది కొనేసుకోకుండా, ట్రెండ్‌కు తగిన జీన్స్‌ డ్రెస్‌ ఎంచుకోవడం మీద దృష్టి పెట్టాలి.

జబర్దస్త్‌ జీన్స్‌ ప్యాంట్స్‌

టాంపర్డ్‌ జీన్స్‌: వెలసిపోయినట్టుండే జీన్స్‌ డైలీ వేర్‌గా బాగుంటాయి. వీటి మీదకు కార్డిగాన్స్‌ లేదా లాంగ్‌ టీషర్ట్‌లను ధరించాలి. బూట్స్‌, స్పోర్ట్స్‌ షూస్‌, చేతికి పెద్ద డయల్‌ వాచ్‌ అందంగా ఉంటాయి. సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ కావాలనుకుంటే హాజరయ్యే ప్రదేశాన్ని బట్టి జీన్స్‌ ఎంచుకోవవాలి. జీన్స్‌ షర్ట్‌, టీ షర్ట్‌, క్రాప్‌ టాప్స్‌తో జీన్స్‌ను మ్యాచ్‌ చేయవచ్చు. అందమైన శరీరాకృతి కలిగి ఉండే అమ్మాయిలకు పెన్సిల్‌ కట్‌ జీన్స్‌ బాగుంటాయి. అయితే కురచగా కనిపించే అమ్మాయిలు బూట్‌కట్‌ జీన్స్‌ను ఎంచుకోకపోవడమే మేలు. బూట్‌కట్‌ జీన్స్‌కు స్కిన్‌ ఫిట్టింగ్‌ టాప్స్‌ బాగుంటాయి. ఈ జీన్స్‌కు మ్యాచింగ్‌గా పెన్సిల్‌ హీల్స్‌ ధరించాలి. సాదాసీదాగా కనిపించాలనుకుంటే స్ట్రెయిట్‌ కట్‌ జీన్స్‌ ఎంచుకోవాలి. కాటన్‌ టాప్స్‌ మొదలు ఎలాంటి టాప్స్‌తోనైనా ఈ రకం జీన్స్‌ను మ్యాచ్‌ చేయవచ్చు. కాస్త ట్రెండీగా కనిపించాలనుకుంటే కలర్‌ఫుల్‌ స్టోల్‌ ధరించాలి. బిగుతుగా ఉండే జీన్స్‌ను ఇష్టపడని వాళ్ల కోసం ఉద్దేశించినవే బాయ్‌ఫ్రెండ్‌ జీన్స్‌. వీటిని బూట్స్‌, హీల్స్‌తో మ్యాచ్‌ చేయవచ్చు.

జీన్స్‌ స్కర్ట్‌

ట్రెండీగా, మోడర్న్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు జీన్స్‌ స్కర్ట్స్‌ను ఎంచుకోవచ్చు. నీ లెంగ్త్‌, షార్ట్‌ లెంగ్త్‌ స్కర్చుల్లో పొడవుగా ఉండే అమ్మాయిలు షార్త్‌ లెంగ్త్‌, కురచగా ఉండే అమ్మాయిలు నీ లెంగ్త్‌ స్కర్ట్స్‌ వేసుకోవచ్చు. అలాగే ఎంబ్రాయిడరీ, సెక్విన్స్‌ కుట్టిన స్కర్ట్స్‌ ఈవినింగ్‌ పార్టీలకు బాగుంటాయి. ఈ రకం స్కర్ట్స్‌కు జోడీగా బూట్స్‌, స్పోర్ట్స్‌ షూస్‌ ధరించవచ్చు. చేతికి పెద్ద డయల్‌ వాచ్‌ బాగుంటుంది.

జీన్స్‌ టాప్స్‌

జీన్స్‌ మెటీరియల్‌తో తయారయ్యే టాప్స్‌, టైట్‌ ఫ్రాక్స్‌ ట్రెండీగా, స్టైలి్‌షగా ఉంటాయి. షికార్లకూ, సరదాలకూ తగినట్టు సౌకర్యంగా కూడా ఉంటాయి. ఫుల్‌ హ్యాండ్‌ టాప్‌ లేదా షర్ట్‌ను జీన్‌ ప్యాంట్‌తో, స్కర్ట్‌తో మ్యాచ్‌ చేయవచ్చు. ఫ్రాక్‌కు పెన్సిల్‌ హీల్‌ షూలు, బూట్స్‌ చక్కగా మ్యాచ్‌ అవుతాయి. సింపుల్‌ జ్యువెలరీ, యాక్సెసరీస్‌ ఈ రకం డ్రస్సులకు చాలా బాగా నప్పుతాయి.

Updated Date - Aug 21 , 2024 | 04:39 AM

Advertising
Advertising
<