ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : అహంకారంతో ఆనందం దూరం

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:18 AM

ఒక తోటలో చాలా రకాల పూలు ఉండేవి. వాటిలో ఒక గడ్తి పువ్వు కూడా ఉంది. ఒక ఉదయం పూట ఇద్దరు మనుషులు ఆ పూలతోటకు వచ్చి అన్ని మొక్కలను చూస్తూ, దాన్ని చూడు గడ్డిపువ్వు అయినా ఎంత అందంగా ఉందో అన్నారు.

Littles : ఒక తోటలో చాలా రకాల పూలు ఉండేవి. వాటిలో ఒక గడ్తి పువ్వు కూడా ఉంది. ఒక ఉదయం పూట ఇద్దరు మనుషులు ఆ పూలతోటకు వచ్చి అన్ని మొక్కలను చూస్తూ, దాన్ని చూడు గడ్డిపువ్వు అయినా ఎంత అందంగా ఉందో అన్నారు. ఆ మాటలు విన్న గడ్డి పువ్వు చాలా ఆనందించింది.ఆ తోటలో ఉన్న అన్ని పూలకంటే తానే అందమైన దాన్ని అనుకున్నది. దాని మనసులో తాను మిగతా పూలకన్నా ప్రత్యేకం అనే భావనప్రవేశించింది. అదే ఆలోచనతో తన పక్కనున్న మొక్కలకు పూచిన పూలుతనను స్నేహంగా పలకరించినా మొహం తిప్పుకుని వాటితో మాట్లాడకుండా ఉండటం తన గొప్పతనం అనుకున్నది.

ఇదేమిటి అని అడిగిన మిగతా పూలతో ఉదయం కొందరు ఈ తోటకు వచ్చి, అన్ని పూలనుచూసి అన్నిటికంటేనేనే అందంగా ఉన్నానుఅని చెప్పి, వెళ్లారు, రేపో మాపోనేను చాలా మంచి స్థానంలో ఉంటాను అని వాటితో చెప్పింది. ఆ మర్నాడు ఉదయం గుడిలో దేవుడికి పూలమాలలు సమర్పించడానికి గుడి పూజారి పూలు కోసుకెళ్లడానికి వచ్చాడు మందారాలు, నంది వర్థనాలు,పారిజాతాలు వంటి అన్నిపూలను కోసాడు కానీ ఈ గడ్డి పువ్వు వంక తిరిగి కూడా చూడలేదు గడ్డి పువ్వుకు బాధ కలిగినా ఈయన కాకపోతే మరొకరు వచ్చి,నన్ను మంచి చోటుకు తీసుకుపోతారు అని తనను తాను ఓదార్చుకుంది.

ఆ రోజు సాయంత్రం అత్తర్లు తయారు చేసే వ్యాపారి పూల సేకరణ కోసం వచ్చాడు అతను మల్లెలు గులాబీలనే తప్ప మిగతా పూలను పట్టించుకోలేదు,ఈ గడ్డిపువ్వు వంక తిరిగి చూడనైనా చూడలేదు. ఈసారి గడ్డిపువ్వు ఇంకా ఎక్కువ బాధ పడింది. ఆ మర్నాడు పెద్ద గాలివాన వచ్చి, గడ్డిపువ్వు ఎగిరిపోయి దూరంగా ఉన్న చెత్తకుప్ప మీద పడిపోయింది. అహంకారంతో మిగతా ఏ పూలతో మాట్లాడకుండా ఉన్నగడ్డిపువ్వుకు ఆ చెత్తకుప్ప మీద అసలు మాట్లాడటానికి వేరే పువ్వులే కనిపించలేదు. అనవసరంగా తోటలో మంచి మిత్రులను దూరం చేసుకున్నాను కదా అని బాధ పడింది గడ్డిపువ్వు.

Updated Date - Oct 01 , 2024 | 12:18 AM