ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : ఎద్దు పాలు

ABN, Publish Date - Sep 10 , 2024 | 01:48 AM

ఒక రోజు అక్బర్‌ చక్రవర్తికి సరదాగా బీర్బల్‌ ను పరీక్షించాలి అనిపించింది, వెంటనే బీర్బల్‌ను పిలిపించి, నాకు చాలా తలనొప్పిగా ఉంది.

Littles : ఒక రోజు అక్బర్‌ చక్రవర్తికి సరదాగా బీర్బల్‌ ను పరీక్షించాలి అనిపించింది, వెంటనే బీర్బల్‌ను పిలిపించి, నాకు చాలా తలనొప్పిగా ఉంది. వైద్యుని పిలిచి చూపిస్తే, దీనికి మందు తయారు చేయాలంటే ఎద్దు పాలు కావాలి అన్నాడు. నువ్వు వెళ్లి ఆ పాలు తెప్పించే పని చూడు లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయిఅని చెప్పాడు బీర్బల్‌ అది విని, మారు మాట్లాడకుండా అలాగే మహారాజా అని వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి, ఆందోళనగా ఉన్న బీర్బల్‌ను అతని భార్య విషయం ఏమిటని ఎందుకు ఆందోళనగా ఉన్నారని అడిగింది, మహారాజు పురమాయించిన పని సంగతి చెప్పాడు బీర్బల్‌. దీనికేనా ఇంత కంగారు? అని నవ్వేసింది బీర్బల్‌ భార్య. నేనో ఉపాయం చెబుతాను మీరు నేను చెప్పినట్టు చేస్తే, ఈ గండం గట్టెక్కవచ్చు అన్నది ఆమె .

సరేనని ప్రశాంతంగా నిద్రపోయి, రెండు రోజుల తర్వాత అక్బరు కొలువుకు వెళ్లాడు బీర్బల్‌. ఏమైంది ఎద్దుపాల సంగతి? అని అడిగాడు అక్బరు. దానికి బీర్బల్‌ మహారాజా ఎద్దుపాల జాడ కనుక్కున్నాను. కానీ ఆ పాలు అమ్మే అతనికి నిన్న మగ పిల్లాడు పుట్టడం వల్ల ఆరోగ్యం బాగా లేదు. అతని ఆరోగ్యం బాగు పడగానే మీకు ఎద్దుపాలు తెచ్చి ఇవ్వగలడుఅని చెప్పాడు అది విన్న అక్బరు ‘మగ వాడికి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా బీర్బల్‌?నీ చమత్కారం కాకపోతే? అన్నాడు దానికి బీర్బల్‌ నవ్వి, ‘మరి ఎద్దు పాలు ఇవ్వడం ఏమిటి మహారాజా మీ చమత్కారం కాకపోతే?’ అన్నాడు, తన సవాలును తనకే తిప్పికొట్టిన బీర్బల్‌ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు అక్బరు చక్రవర్తి.

Updated Date - Sep 10 , 2024 | 01:48 AM

Advertising
Advertising