ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : దేవుని ఏర్పాటు

ABN, Publish Date - Sep 24 , 2024 | 04:19 AM

ముకుందాపురంలో ఉండే రవి అనే యువకుడికి దేనికైనా, ఎవరికైనా వంకలు పెడుతూ అది అలా ఎందుకుంది? ఇది ఇలా ఎందుకు ఉంది? అని వాదించడం అలవాటు.

Littles : ముకుందాపురంలో ఉండే రవి అనే యువకుడికి దేనికైనా, ఎవరికైనా వంకలు పెడుతూ అది అలా ఎందుకుంది? ఇది ఇలా ఎందుకు ఉంది? అని వాదించడం అలవాటు. ఊరి వారంతా ఏదో రకంగా అతనికి మంచి బుధ్ది వస్తే బాగుండు అనుకునే వారు. ఓకరోజు రవి అడవి మార్గంలో నడిచి వెళుతూ, ఒక పెద్ద మర్రి చెట్టును, ఇంకా ఆ పక్కనే నేలమీద పాకుతున్న గుమ్మడి తీగను, దానికి కాసిన కాయలను చూసాడు. వెంటనే తన సహజమైన బుధ్దితో ఇదేమి సృషి?్ట ఇలా ఉంది? అంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలు కాయడం, ఇంత సన్నని తీగకు ఇంత పెద్ద కాయలు కాయడం ఏమీ బాలేదు అనుకున్నాడు.

ఆ చెట్టు నీడ, దాని చల్లదనం చూసి, కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని ఆ చెట్టు కింద పడుకొని అలాగే నిద్ర పోయాడు. రవి నిద్ర లేచేసరికి, తన మీద కొన్ని చిన్న చిన్న మర్రి కాయలు పడి ఉన్నాయి. అవి తను నిద్ర పోతూ ఉండగా చెట్టు మీదనుండి రాలి తన మీద పడ్డాయని గ్రహించాడు రవి. వెంటనే అతనికి హఠాత్తుగా నిద్ర పోవడానికి ముందు తాను సృష్టి గురించి తప్పుగా అనుకున్నది గుర్తు వచ్చింది. ‘నిజంగా అంత పెద్ద గుమ్మడికాయలు ఈ మర్రిచెట్టుకు కాసి ఉంటే, అంత ఎత్తునుండి అవి నామీద ఈ మర్రి పళ్లలాగా పడి ఉంటే నేను ఏమైపోయేవాడినో’ అనుకొని, దేవుని సృష్టి ఆయన చేసిన ఏర్పాట్లు వంక పెట్టడానికి వీలు లేనంత మంచివి అనుకొని లేచి, తన ఊరికి వెళ్లిపోయాడు. ఆ రోజు మొదలుకొని అన్నిట్లో లోపాలు వెతకడం మానుకున్నాడు రవి.

Updated Date - Sep 24 , 2024 | 04:19 AM