ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీర్బల్‌ కిచిడీ

ABN, Publish Date - May 02 , 2024 | 10:45 PM

అక్బర్‌, బీర్బల్‌ ఒక రోజు ఓ కొలను దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో బాగా చలికాలం. మంచులా చల్లగా ఉన్నాయి ఆ కొలనులోని నీళ్లు. అక్బర్‌ ఆ కొలను దగ్గరకు వచ్చి చేయి పెట్టాడు నీళ్లలో. ఇంత చల్లగా ఉండే కొలనులో డబ్బుకోసం దిగి రాత్రంతా ఉండేవాళ్లు ఉంటారా? అని అడిగారు అక్బర్‌

క్బర్‌, బీర్బల్‌ ఒక రోజు ఓ కొలను దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో బాగా చలికాలం. మంచులా చల్లగా ఉన్నాయి ఆ కొలనులోని నీళ్లు. అక్బర్‌ ఆ కొలను దగ్గరకు వచ్చి చేయి పెట్టాడు నీళ్లలో. ఇంత చల్లగా ఉండే కొలనులో డబ్బుకోసం దిగి రాత్రంతా ఉండేవాళ్లు ఉంటారా? అని అడిగారు అక్బర్‌. ‘అవును ఉంటారు. ఎంతో మంది ఉంటారు’ అన్నారు బీర్బల్‌. ‘రాత్రంతా చల్లని నీళ్లలో ఉంటారా? వారికి ఒక్క బంగారు నాణెం ఇస్తాం’ అని దండోరా వేశారు.

ఓ పేదవాడు వచ్చాడు. ఆ బంగారు నాణెం చాలు అంటూ వచ్చాడు. కొలనులో ఉన్నాడు. రాత్రంతా కొలనులో ఉంటే నాలుగైదు బంగారు నాణేలు ఆ పేదవాడికి ఇవ్వండి అన్నాడు మరోసారి అక్బర్‌. దీంతో పేదవాడు ఆ విషయం తెలిసి పొంగిపోయాడు. ఉదయాన్నే పేదవాడిని చూడటానికి రాజు వచ్చాడు. విచిత్రం పేదవాడికి ఏమీ కాలేదు. ‘ఈ పేదవాడు నిజంగా నీళ్లలో ఉన్నాడా?’ అని సైనికులను, అక్కడ తిరిగేవాళ్లను వాకబు చేశాడు.

పేదవాడు నిజాయితీగా రాత్రంతా ఆ నీళ్లలో ఉన్నాడు కాబట్టి భయపడలేదు. ‘ఇంత ఆశ్చర్యమేమిటి? ఎలా ఉన్నావు?’ అనడిగాడు రాజుగారు. ఆ పేదవాడు ఇలా అన్నాడు.. ‘అయ్యా.. దూరంగా ఓ కాంతి కనపడింది. దాన్ని చూస్తూ వెచ్చదనంగా అనుకున్నా. అందుకే చల్లని నీళ్ల గురించి మర్చిపోయాను’ అన్నాడు. ‘అదేంటీ ఆ వెలుతురును తీసుకున్నావు. ఇది మోసం. దీనికి నాణేలు రావు. కారాగార శిక్ష తప్పదు’ అన్నాడు అక్బర్‌.

అక్బర్‌ చెప్పిన మాటలు బీర్బల్‌కు నచ్చలేదు. ఏమాత్రం భయపడకుండా ‘ఇలా ఉండటం అతని గొప్పతనం కాక ఏమవుతుంది? అతని మెదడును నియంత్రించాడు’ అన్నాడు. అయినా అక్బర్‌ వొప్పుకోలేదు.

ఒకరోజు బీర్బల్‌ తన ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. ‘కిచిడీ బావుంటుంది’ అన్నాడు. అలానే బీర్బల్‌ ఇంటికి అక్బర్‌ వెళ్లారు. పావు గంట గడిచింది. ఇంకా కిచిడీ తయారు కాలేదు అన్నాడు బీర్బల్‌.

ఆ తర్వాత లోపలకు రాజుగారిని తీసుకెళ్లాడు. కట్టెలున్నాయి. దానికి ఓ పాత్ర కట్టి ఉంది. కింద మంట ఉంది. ‘ఈ కిచిడీ అయ్యేంతవరకూ ఉండటం కష్టం. ఇది కాదేమో’ అన్నాడు. ‘ఎలా?’ అని అడిగాడు. ‘మంట తగిలితే అదే అవుతుంది కొన్ని గంటలకైనా మహాప్రభూ’ అన్నాడు. అక్బర్‌ కోప్పడ్డాడు.

ఈ పరాచకాలేంటీ? అన్నాడు. ‘ఈ మంటనే కిచిడీకి అందకుంటే.. దూరంగా ఉండే వెలుగు ఆ కొలనులో చలికి వణికే ఆ పేదవాడికి ఎలా తెలుస్తుంది.’ అనడిగాడు బీర్బల్‌. వెంటనే అక్బర్‌కు విషయం అర్థమైంది.

ఆ పేదవాడిని ఖైదీ నుంచి విముక్తి కల్పించమన్నాడు. చెప్పిన బంగారు నాణేలతో మరిన్ని బంగారు నాణేలను ఇచ్చాడు. రాజు కాళ్లమీద పడ్డాడు. ఆ పేదవాడడు తన పేదరికం పోయినట్లే అని మనసులో అనుకున్నాడు. ఆ పేదవాడు విషయం తెలుసుకుని బీర్బల్‌కు కృతజ్ఞత చెప్పాడు పేదవాడు.

Updated Date - May 02 , 2024 | 10:45 PM

Advertising
Advertising