మీకు తెలుసా ఈ విషయం ?
ABN, Publish Date - May 01 , 2024 | 01:40 AM
తలమీద ఎర్రగా ఉండే ఈ నల్లని పిట్ట పేరు ‘బ్లాక్ ఉడ్‌పెకర్’ ('Black Woodpecker') . తెలుగులో నల్లని వడ్రంగి పిట్ట అంటారు. ఇవి యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి
తలమీద ఎర్రగా ఉండే ఈ నల్లని పిట్ట పేరు ‘బ్లాక్ ఉడ్‌పెకర్’ ('Black Woodpecker') . తెలుగులో నల్లని వడ్రంగి పిట్ట అంటారు. ఇవి యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ఆసియాతో పాటు ఉత్తర, అమెరికా దక్షిణ అమెరికాల్లో కూడా ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. ఇతర ప్రదేశాలకు వెళ్లటానికి ఇష్టపడవు.
55 సెం.మీ. పొడవు ఉండే ఈ పక్షి వింగ్ స్పాన్ (Wing span) 84 సెం.మీ.
ఈ పక్షి ముక్కు గట్టిగా ఉంటుంది. ఎండిపోయిన లేదా ఫంగ్‌సతో, పురుగుల వల్ల ఎండిపోయిన చెట్లను ఇవి తొలుస్తాయి. వీటి మెడ కండరాలు స్ర్టాంగ్‌గా ఉండటం వల్ల సులువుగా చెట్లును తొలుస్తాయివి.
ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండే చెట్లనూ తొలుస్తాయి. గూడు చేసుకుంటాయి. ఈ పక్షులు మరో గూడు చేసుకున్నప్పుడు ఇతర పక్షులు ఆ గూళ్లలో ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. అన్నట్లు 50 సెం.మీ. కంటే లోతు చెట్టును తొలుస్తాయి.
వడ్రంగి పిట్టలు ప్రపంచ వ్యాప్తంగా 180 రకాలు ఉన్నాయి.
పురుగులు, చెట్ట మీద ఉండే చీమలను తింటాయి.
ఆరు గుడ్లను పెడతాయి. 20 రోజుల పాటు పొదుగుతాయి.
Updated Date - May 01 , 2024 | 01:41 AM