ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజుగారి ముఖం

ABN, Publish Date - May 17 , 2024 | 12:37 AM

కృష్ణదేవరాయలు రాజ్యంలో దేవుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దేవుడే కానీ.. అతనికి మనిషికి ఉండే కష్టాలన్నీ ఉండేవి

కృష్ణదేవరాయలు రాజ్యంలో దేవుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దేవుడే కానీ.. అతనికి మనిషికి ఉండే కష్టాలన్నీ ఉండేవి. దీంతో అతను తప్పుగా తన తల్లిదండ్రులు దేవుడు పేరు పెట్టాడని బాధపడేవాడు. ఎవరైనా సరే దేవుడు ముఖం చూస్తే వారికి ఇబ్బందులే అని ఆ ఊరంతా పుకారు వచ్చింది. దీంతో ఊరిలోని జనాలంతా నమ్మారు. అసలు ఈ విషయం నమ్మకూడదనే విషయం కూడా వారికి తెలీదు. అతని ముఖం చూస్తే చెడ్డ జరుగుతుందని అందరిమాట.

ఈ మాట రాయల వారి చెవిన పడింది. రాయలవారు సాహసికులు. ఇలాంటి మాటలు చెవిన పట్టించుకోరు. ఎలాంటి సమస్యలు రావు అని అనుకున్నాడు. ఒక రోజు ఉదయాన్నే రాయలవారు వేటకు వెళుతుండగా దేవుడు ముఖం చూశాడు.

దేవుడు నవ్వుతూ వెళ్లిపోయాడు. ఈ రోజు రాయల వారు అంతే అన్నారు పక్కన ఉండేవారు. రాయలవారు వేటకు వెళ్లారు. అదృష్టవశాత్తూ పులి నోట చిక్కాల్సినది పోయి ప్రాణాలతో బతికి బట్ట కట్టాడు. దీంతో కోపంగా ఇంటికి వచ్చాడు. ‘ఈ దేవుడును ముందు ఉరితీయండి’ అని ఆజ్ఞాపించాడు. దీంతో దేవుడును బంధించారు. కారాగారంలో ఉన్న దేవుడును చూడటానికి ఆమె భార్య వచ్చింది. ‘ఇక జీవితం ఇంతే. శుభం’ అన్నాడు. ‘నువ్వు తప్పు చేయలేదు. నీ ముఖం చూస్తే ఆయనకు సమస్య వచ్చిందని.. ఇలా చేస్తే ఎలా?’ అంటూ ఏడ్చింది. ఆ దేవుడు ఉంటే నువ్వు బతుకుతావు దేవుడూ అన్నది. ఆమె బాధను రామలింగ కవి చూశారు. విషయం అడిగి తెలుసుకున్నారు.


మరుసటి రోజు దేవుడిని ఉరివేయాలి. దేవుడు భార్య రామలింగడి కవి స్నేహితురాలు కూడా. తన బాధను చెప్పుకుని ఎలాగైనా కాపాడాలని వేడుకుంది. రామలింగకవి ఓ ఉపాయం పన్నాడు. మరుసటి రోజు దేవుడికి ఉరి.

అందరూ వెళ్లారు. రామలింగ కవి అక్కడే ఉన్నాడు. ఆకు మీద రాసిన అక్షరాలు చదివిన తర్వాత అతన్ని ఉరి వేయండి అన్నాడు తలారిని. సైనికులు కూడా ఆ అక్షరాలను చదివారు. ఇందులో ఇలా ఉంది.. ‘మీరు ఎవరైనా సరే ఉదయాన్నే రాయలవారి ముఖం చూస్తే ఉరి తప్పదు’ అని. అందరూ ఆశ్చర్యంతో వణికిపోయారు. ఆ అక్షరాలను రాయలవారు చదివారు. ‘అయ్యా.. మిమ్మలను చూడటం ఇతని చావుకు వచ్చింది అంటే.. మీరు దురదృష్టవంతులా? ఇతనా?’ అని అడిగాడు. రాయలకు విషయం అర్థం అయింది. సిగ్గుపడ్డాడు తన అజ్ఞానానికి.

Updated Date - May 17 , 2024 | 12:37 AM

Advertising
Advertising