ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : నక్క ఉపాయం

ABN, Publish Date - Jun 18 , 2024 | 01:19 AM

వీరభద్ర పురం పక్కనున్న అడవిలో ఉన్న చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువులో ఉండే చేపలన్నిటినీ అది తింటూ ఉండేది. అదే చెరువులో నివసించే పీతకు ఈ మొసలికి మంచి స్నేహం.

వీరభద్ర పురం పక్కనున్న అడవిలో ఉన్న చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువులో ఉండే చేపలన్నిటినీ అది తింటూ ఉండేది. అదే చెరువులో నివసించే పీతకు ఈ మొసలికి మంచి స్నేహం. కొంత కాలానికి ఆ మొసలికి అక్కడి చేపలు తినీతినీ విసుగు పుట్టింది. అది తన నేస్తమైన పీతను పిలిచి నాకు రోజూ ఈ చేపలే తినాలంటే విసుగ్గా ఉంటోంది. వేరే ఏదైనా జంతువు ఆహారంగా దొరికితే బాగుంటుంది. ‘నువ్వు అడవిలోకి వెళ్లి అక్కడి జంతువులకు మొసలి చనిపోయిందని చె ప్పు, ఆ మాటనమ్మిన జంతువులన్నీ ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. అపుడు నేను ఏదో ఒక జంతువును పట్టి తింటాను’ అని చెప్పింది.

దాని మాటలకు సరే అన్న పీత అలాగే అడవిలోకి వెళ్లి ‘మిత్రులారా చెరువులోని మొసలి చచ్చిపోయింది, ఇక మనకేం భయం లేదు అందరూ అక్కడికి వచ్చినీళ్లు తాగండి’ అని చెప్పింది. పీత మాటలు అన్ని జంతువులు నమ్మాయి కానీ ఒక నక్క మాత్రం నమ్మలేదు. అందులో ఏదో మోసం ఉంది అనుకున్నది. ఐనా ఆ నక్క మిగతా జంతువులతో పాటు చెరువు దగ్గరకు వెళ్లి, అందరికీ వినిపించేటట్లు ఇలా అన్నది. ‘మిత్రులారా నా మిత్రురాలైన ఒక గుడ్లగూబ చెప్పిన దాని ప్రకారం మొసలి చనిపోయినా దాని తోక మాత్రం కదులుతూనే ఉంటుంది.

ఈ మొసలి తోక కదిలితే ఇది చనిపోయిందని మనం నమ్మవచ్చు అన్నది. ఆ మాటలు విన్న మొసలి తాను చనిపోయానని నమ్మించడం కోసం తన తోకను వెంటనే మెల్లగా కదిలించడం మొదలు పెట్టింది. అది చూసిన నక్క‘ నేను అనుమానించినట్టే ఈ మొసలి చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏదో ఒక జంతువును పట్టుకుని తినడానికి అది పీతతో కలిసి ఇంత నాటకం ఆడింది’ అనుకుని, మిగతా జంతువుల దగ్గరకు వెళ్లి వాటి చెవిలో రహస్యంగా మొసలి ఆడిన నాటకం గురించి చెప్పింది. అసలు విషయం తెలుసుకున్న జంతువులు ‘హమ్మయ్య గండం గడిచింది’ అనుకుని, ఉపాయంతో అందరినీ కాపాడిన నక్కకు కృతజ్ఞతలు చెప్పాయి.

Updated Date - Jun 18 , 2024 | 01:20 AM

Advertising
Advertising