ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : పులిగోరు

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:26 AM

కృష్ణాపురంలో ఉండే కేశవానంద అనే స్వామీజీ వద్దకు రమణ అనే యువకుడు వచ్చి స్వామీ నాకు కోపం చాలా ఎక్కువగా వస్తూంది. దాని వల్ల అందరితో గొడవలు పడుతున్నాను

కృష్ణాపురంలో ఉండే కేశవానంద అనే స్వామీజీ వద్దకు రమణ అనే యువకుడు వచ్చి స్వామీ నాకు కోపం చాలా ఎక్కువగా వస్తూంది. దాని వల్ల అందరితో గొడవలు పడుతున్నాను .ఎవరిని చూసినా చిరాకుగా ఉంటుంది నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. దానికి ఆ స్వామీజీ నాయనా నీ కోపం చిరాకు తగ్గాలి అంటే నువ్వు అసలైన పులి గోరు మెడలో వేసుకోవాలి. పక్కనున్న అడవిలో ఒక పులి ఉంది దాని వద్దకు వెళ్లి నా పేరు చెప్పు నీకు గోరు ఇచ్చి పంపుతుంది.

అన్నాడు అని రమణ అడవికి వెళ్లి ఒక బక్కచిక్కిన ముసలి పులిని కలిస, కేశవ్‌ ఆనంద స్వామి పేరు చెప్పి తనకు గోరు కావాలని అడిగాడు. దానికి ఆ పులి, నాకు ముసలితనం వచ్చి, చూపు సరిగా ఆనడంలేదు. నువ్వు నాకు రోజూ ఆహారం తెచ్చిస్తే నీకు గోరు ఇస్తానుఅన్నది దానికి సరేనన్న రమణ ప్రతిరోజూ మాంసం, చేపలు తీసుకెళ్లి పులికి ఇచ్చేవాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ పులి ఇక నేడో రేపో నేను చనిపోతాను. నేను చనిపోగానే నా గోళ్లు నువ్వు తీసుకెళ్లవచ్చు అని అదేరోజున ఆ పులి చనిపోయింది. పులి చనిపోవడం చూసి, చాలా బాధ పడిన రమణ సామీజీ వద్దకు వచ్చి, దుఃఖ పడ్డాడు అది చూసన సామీజీ ఇపుడు చనిపోయిన పులి మీద ఎంత జాలి, ప్రేమ చూపిస్తున్నావో, అదే ప్రేమ నీతోటి మనుషుల మీద కూడా చూపించు. నీ కోపం, చిరాకు ఇట్టే తగ్గుతాయి అని చెప్పాడు. ఆ రోజునుండి రమణ చుట్టూ ఉన్న అందరిలో మంచిని చూడసాగాడు.

Updated Date - Jul 20 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<