ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Story : తగిన శాస్తి

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:22 PM

ఒక ఊరిలో వీరయ్య అనే వ్యాపారికి ఒక గాడిద ఉండేది. వీరయ్య రోజూ ఆ గాడిద మీద సరుకుల బస్తాలు, సంచులు వేసి అంగడికి తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఒక రోజు వీరయ్య గాడిద మీద కొన్ని ఉప్పుసంచులు వేసి సంతకు తీసుకుని పోతుంటే, దారిలో ఒక చిన్న నీటి మడుగు అడ్డం వచ్చి , ప్రమాదవశాత్తూ గాడిద అందులో పడిపోయింది. ఉప్పు బస్తాలు కూడా నీటిలో మునగడంతో ఉప్పునీటిలో కరిగిపోయి గాడిద పైకి లేచేసరికి వీపు మీద బరువు తగ్గిపోయి చాలా తేలికగా హాయిగా అనిపించింది గాడిదకు.

Story : ఒక ఊరిలో వీరయ్య అనే వ్యాపారికి ఒక గాడిద ఉండేది. వీరయ్య రోజూ ఆ గాడిద మీద సరుకుల బస్తాలు, సంచులు వేసి అంగడికి తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఒక రోజు వీరయ్య గాడిద మీద కొన్ని ఉప్పుసంచులు వేసి సంతకు తీసుకుని పోతుంటే, దారిలో ఒక చిన్న నీటి మడుగు అడ్డం వచ్చి , ప్రమాదవశాత్తూ గాడిద అందులో పడిపోయింది. ఉప్పు బస్తాలు కూడా నీటిలో మునగడంతో ఉప్పునీటిలో కరిగిపోయి గాడిద పైకి లేచేసరికి వీపు మీద బరువు తగ్గిపోయి చాలా తేలికగా హాయిగా అనిపించింది గాడిదకు.

ఆ మర్నాడు కూడా వీరయ్య గాడిద వీపు మీద ఉప్పు సంచులు వేసి సంతకు తీసుకెళుతూ ఉంటే ఆ రోజు వీపు మీది బరువు తగ్గించుకోవాలని గాడిద ఈసారి కావాలనే నీటి మడుగులో పడిపోయింది. ఉప్పు కరిగి పోవడం వల్ల వీరయ్యకు నష్టం వచ్చింది. గాడిద కావాలనే నీటిలో పడిన విషయం గమనించిన వీరయ్య ఆ మర్నాడు గాడిదకు బుఽధ్ది చెప్పాలనుకున్నాడు.

సంతకు వెళ్లే దారిలో ఉన్న నీటి మడుగులో ఆ రోజు కూడా గాడిద తాను మోస్తున్నది ఉప్పు సంచులే కదా అనుకుని నీళ్లలో పడింది. కానీ సులువుగా పైకి లేవలేక పోయింది. ఎంతో కష్ట పడి పైకి లేచాక చూస్తే దాని వీపు మీద ఉన్నవి దూది సంచులు. అవి నీటిలో తడవగానే ఇంకా బరువెక్కి పోయి. గాడిదకు నడవడం కూడా కష్టంగా మారింది. మనం చేయాల్సిన పనిని , బాధ్యతను తప్పించుకోవాలి అని చూస్తే పర్యవసానం ఇలాగే అవుతుంది కాబోలు నాకు తగిన శాప్తి చేశాడు నా యజమాని అనుకున్న గాడిద మరెప్పుడూ తను చేయాల్సిన పనిని తప్పించుకోలేదు.

Updated Date - Jun 06 , 2024 | 11:22 PM

Advertising
Advertising