భయంలేని జింక పిల్ల భయపడిన సింహరాజు
ABN, Publish Date - May 07 , 2024 | 02:00 AM
అనగనగా ఓ అడవి. దగ్గర్లోనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఒక రైతు చేలోకి జింకలొచ్చేవి. వాటిని ఏమీ అనేవాడు కాదు. ఆ రైతు గుడిసెలోకి కూడా జింకలు వెళ్లి పడుకునేవి. ఒక రోజు రాత్రి జింకపిల్ల విపరీతంగా ఏడుస్తోంది.
అనగనగా ఓ అడవి. దగ్గర్లోనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఒక రైతు చేలోకి జింకలొచ్చేవి. వాటిని ఏమీ అనేవాడు కాదు. ఆ రైతు గుడిసెలోకి కూడా జింకలు వెళ్లి పడుకునేవి. ఒక రోజు రాత్రి జింకపిల్ల విపరీతంగా ఏడుస్తోంది. వాళ్ల అమ్మ జింకపిల్ల ఏడ్వొద్దని కథలు చెబుతోంది. అయినా ఏడుపు ఆపలేదు ఆ జింకపిల్ల. అంతలోనే ఆ గుడిసె దగ్గరకొచ్చి ఓ సింహం బయట పొంచి ఉంది.
బయటికి వస్తూనే జింక గొంతు కొరికేద్దామా? అన్నట్లు సింహం ఎదురు చూస్తోంది. ‘అదిగో ఎలుగు బంటి వస్తోంది’ అంటూ పిల్లతో అన్నది జింక. జింకపిల్ల భయపడలేదు. అదిగో.. హైనా వచ్చె అన్నది. అయినా జింక భయపడలేదు. అదిగో సింహం వచ్చింది.
తింటుంది అని చెప్పినా జింకపిల్ల ఏడుపు ఆపలేదు. ‘అదిగో అఫ్లాతూన్ వచ్చాడు’ అంటూనే జింకపిల్ల ఏడుపు ఆపింది. సైలెంట్ అయింది. ఇది విన్న సింహం వెనక్కి పరిగెత్తింది. ఆ చీకట్లో ఒక వ్యక్తికి ఢీ కొట్టింది. అది సింహమనే విషయం తెలీక దాని మెడను ఆ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు.
ఆఫ్లాతూన్ గాడు చంపేస్తాడేమోనని ఆ సింహం పరిగెడుతోంది. కిందపడితే.. ఇదేదో తింటుందని ఆ వ్యక్తి అలానే సింహాన్ని పట్టుకున్నాడు. కొంచెం దూరం వెళ్లాక సింహం గొంతు విడిచేశాడు ఆ వ్యక్తి. కిందపడిపోయాడు. ఆఫ్లాతూన్ వస్తాడేమోననే భయంతో సింహం గుండె వేగంగా కొట్టుకుంటోంది. వాడేమైనా చంపేస్తాడేమోనని వణుకుతోంది.
వాస్తవానికి అఫ్లాతూన్ అంటే బాక్సర్ అని అర్థం. అయితే అదో భయంకరమైన జంతువు అని సింహం అనుకుంది. దాని బారిన నుండి తప్పించుకున్నాని సంబరపడిపోయింది.
నీతి- నువ్వు మెదడులో ఏమనుకుంటే అదే జరుగుతుంది.
Updated Date - May 07 , 2024 | 02:00 AM