ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Story : తోడేలు తెలివి.. తిరగబడింది!

ABN, Publish Date - Feb 20 , 2024 | 11:19 PM

ఒక అడవిలో తోడేలు ఉండేది. దానికి తెలివి ఎక్కువ. కుందేళ్లను, జింక పిల్లలను తినేది. చూస్తుండగానే అడవిలో ఎండాకాలం వచ్చింది. జంతువులన్నీ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాయి.

ఒక అడవిలో తోడేలు ఉండేది. దానికి తెలివి ఎక్కువ. కుందేళ్లను, జింక పిల్లలను తినేది. చూస్తుండగానే అడవిలో ఎండాకాలం వచ్చింది. జంతువులన్నీ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాయి. నీళ్లు వెతుక్కుంటూ కొన్ని వెళ్లిపోయాయి. ఈ తోడేలుకు మాత్రం సులువుగా ఆహారం దొరకాలనుకునేది. వేటాడకుండా తినాలనుకునేది. దీంతో అడవిలోంచి ఓ ఊరికి వెళ్లాలనుకుంది.

తోడేలు ఎలాగైనా మేకలనో, గొర్రెలనో పొంచి తినాలనుకుంది. అయితే ఎక్కడ చూసి గొర్రెలు, మేకల మందల దగ్గర వేట కుక్కలు ఉండటంతో భయపడింది. ప్రాణాలు దక్కించుకోవటమే తరువాయి అనుకుని పారిపోయింది. అయితే ఆ ఊరిలోని బలిష్టమైన మేకలు, గొర్రెలు చూశాక.. ఊరు వదలి వెళ్లిపోవాలని అనిపించలేదు దానికి. దీంతో ఊరి చుట్టూ చాలా రోజులు తిరిగింది. ఎలాగైనా గొర్రెలను, మేకలను తినాలని నిర్ణయించుకుంది.

అదే ఆలోచనతో తిరిగే తోడేలుకు ఒకరోజు గొర్రె చర్మం దొరికింది. దాన్ని కప్పుకుంది. గొర్రెల గుంపు ఊరికి చేరే వేళ వాటిలో కలసిపోయింది. ఇలా రోజూ గొర్రెల మందలో వెళ్లి వచ్చేది. ఇక రెండు రోజుల తర్వాత గొర్రెలను తినటం ప్రారంభించింది. ‘ఇంత రుచికరమైన ఆహారం ఇక్కడే ఉంది. అనవసరంగా అడవిలో ఉన్నా’ అనుకుంది. చూస్తుండగానే మెల్లగా గొర్రెలు మాయం అవుతున్నాయి. గొర్రెలకాపరికి ఈ విషయం అర్థమైంది.

ఒక రోజు తెల్లారుజామున గొర్రెల దగ్గరకకు వెళ్లాడు. ఓ గొర్రెను కటికకు అమ్మాలనుకున్నాడు. గొర్రెల్లో పెద్ద గొర్రెగా ఒకటి కనిపించింది. దాన్ని తీసుకెళ్లమని పురమాయించాడు. అది వాస్తవానికి తోడేలు. ఒక మనిషి ఈ గొర్రె బరువుగా ఉందని భుజాలకు ఎత్తుకున్నాడు. బతుకుజీవుడా.. అనుకుంటూ తోడేలు ఎగిరి దూకి పారిపోయింది. దాని మీద ఉండే చర్మం తోలు కిందపడిపోయింది. ఆ తర్వాత తోడేలు ఆ పక్కకే రాలేదెన్నడూ

Updated Date - Feb 20 , 2024 | 11:19 PM

Advertising
Advertising