ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Littles : సమయస్ఫూర్తి

ABN, Publish Date - May 17 , 2024 | 11:43 PM

ఒక ఊరిలో విక్రముడు అనే జమీందారు ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. మతిమరుపు ఉండేది కాస్త. కంటిచూపు సరిగా ఉండేది కాదు.

ఒక ఊరిలో విక్రముడు అనే జమీందారు ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. మతిమరుపు ఉండేది కాస్త. కంటిచూపు సరిగా ఉండేది కాదు. డబ్బు ఎక్కువే. తన ఇంటి దగ్గరకు పని చేయటానికి వచ్చిన వారిని రాచి రంపాన పెట్టేవాడు. అయితే వారికి డబ్బులు మాత్రం బాగా ఇచ్చేవాడు.

అయితే ఇంటి పని, పొలం పని అయినా సరిగ్గా చేయకపోతే మాత్రం చివాట్లు తప్పవు. ముక్కోపి కావటంతో ఆయన డబ్బులు వద్దు.. ఆయన పని వద్దు అని ఆ ఊరిలో జనాలు అనుకున్నారు.

జమీందారు పేరుకే జమీందారు. పెద్ద ఇల్లు ఉన్నా.. అతనికి పలికే వాళ్లు లేరు అనుకునేవాళ్లు ఊరి జనాలు. జమీందారు వాలకం చూసి ఇతర ఊరి వాళ్లు కూడా ఆయన దరిదాపుల్లోకి రాలేదు. అయితే తన తోటలోని ఇంటికి రంగులు వేయించాలని అనుకున్నాడు. అయితే రంగులు వేయటానికి పనివాడు దొరకలేదు. దీంతో ఎలా ఇలా అయ్యిందే అని ఆలోచించుకునే సమ యంలో సోమనాథుడు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

ఆయన ఊరు వంద కిలోమీటర్ల దూరం. ‘ఏ దైనా పని ఇప్పించండి అయ్యా’ అన్నాడు. ‘ఈ ఊరి లోనే పదిరోజులు ఉండటానికి ఒక చిన్న గది కావాలి’ అన్నాడు. జమీందారు మిక్కిలి సంతోషంతో ఇలా అన్నాడు. ‘మా తోటలో ఇల్లు ఉంది. అక్కడ ఇంటికి రంగులు పూయాలి. అక్కడే ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండు. అయితే రంగుమాత్రం బాగా పూయాలి. లేకుంటే డబ్బులు ఇవ్వను’ అన్నాడు.


సోమనాథుడు ‘సరే’ అన్నాడు. ఒక చెక్కపెట్టె ఇచ్చాడు. ఈ రంగు వచ్చేట్లు గోడలకు వేయి అన్నాడు. వారం రోజుల్లో ఆ ఇంటికి రంగులు వేశాడు. ఆ చె క్క పెట్టె తీసుకుని పోల్చి చూశాడు. చక్కగా రంగులు వేశాడు. ఇంత పని వా డివి అని నాకు తెలీదు.. అని చెప్పిన డబ్బులు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత జ మీందారు తన భార్యతో ఆ తోటలోని గదికి వెళ్లాడు. ‘ఆహా.. రంగు పూయించి మంచి పని చేశారండి’ అన్నది. ‘సోమనాథుడనే వ్యక్తి ఈ పని చేశాడు. మన దగ్గర ఉద్యోగం ఇద్దామనుకున్నా’ అన్నాడు. వెంటనే తన భార్య ఆ చెక్క పెట్టెను గోటితో గీకింది. రంగు వచ్చింది.

‘ఆహా.. మీ సోమనాథుడు ఎంత తెలివి ఉపయోగించాడు. ముందు చెక్కపెట్టెకు రంగేసి ఆ తర్వాత ఇంటికి వేశాడు. మీ మతిమరుపు, కంటిచూపు తెలిసిందేమో అతనికి’ అన్నది. వెంటనే జమీందారు ఇంత మోసం చేశాడా అన్నాడు. అతని తెలివిని మెచ్చుకోండి అన్నది జమీందారు భార్య. అంతే కదా.. అన్నాడు జమీందారు.

Updated Date - May 17 , 2024 | 11:43 PM

Advertising
Advertising