Google Chrome : గూగుల్ క్రోమ్‌కు కొత్త ఫీచర్లు
ABN, Publish Date - Jun 29 , 2024 | 12:02 AM
గూగుల్ - క్రోమ్ కోసం కొన్ని ఫీచర్లను ఆండ్రాయిడ్, ఐఫోన్లను ఉద్దేశించి తీసుకువచ్చింది. తాజాగా మరో 110 భాషలకు గూగుల్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ సపోర్టు అందించింది.
గూగుల్ - క్రోమ్ కోసం కొన్ని ఫీచర్లను ఆండ్రాయిడ్, ఐఫోన్లను ఉద్దేశించి తీసుకువచ్చింది. తాజాగా మరో 110 భాషలకు గూగుల్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ సపోర్టు అందించింది. దీంతో సపోర్టు పొందిన భాషల మొత్తం సంఖ్య 243 అయింది. ఇటీవలే క్రోమ్‌కు జెమినీ ఏఐ ఫీచర్లను కలిపింది. పారిస్ ఒలింపిక్స్‌కు చాలా ముందుగానే స్పోర్ట్స్ కార్డును తీసుకువస్తోంది. ఐసీసీ టి20 క్రికెట్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం సెర్చ్ చేయాల్సిన పని యూజర్లకు ఉండదు. క్రోమ్‌కు చెందిన డిస్కవర్ ఫీడ్‌లో స్పోర్ట్ కార్డ్స్ - ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో కొత్త టాబ్ పేజీలో లభ్యమవుతాయి. తమకు నచ్చిన టీమ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను వీక్షించే సౌలభ్యం యూజర్లకు ఉంటుంది. ఐప్యాడ్స్, ఆండ్రాయిడ్ టాబ్లెట్స్, కోసం క్రోమ్ అడ్రస్ బార్‌ను గూగుల్ రీడిజైన్ చేసింది. క్రోమ్ యాక్షన్స్ మరొకటి. లోకల్ ఉండే రెస్టారెంట్ పేరు టైప్ చేస్తే ఫోన్ నంబర్లు సహా బిజినెస్ వివరాలు, మ్యాప్, రెవ్యూలు అందుబాటులోకి వస్తాయి.
Updated Date - Jun 29 , 2024 | 12:02 AM