Technology : మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి కొత్త ఫీచర్లు
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:29 AM
మైక్రోసాప్ట్ ఇప్పటికే విండోస్ 10కి వచ్చే ఏడాది అక్టోబర్ 10 నుంచి సపోర్ట్‌ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అనూహ్యంగా విండోస్ 10కి బేటా ప్రోగ్రామ్‌ని తిరిగి ఆరంభించింది. తద్వారా కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. విండోస్ 11కి ప్రత్యేకంగా తెచ్చిన ఏఐ కోపైలెట్‌ని విండోస్ 10 ఇప్పటికే పొందింది.
మైక్రోసాప్ట్ ఇప్పటికే విండోస్ 10కి వచ్చే ఏడాది అక్టోబర్ 10 నుంచి సపోర్ట్‌ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అనూహ్యంగా విండోస్ 10కి బేటా ప్రోగ్రామ్‌ని తిరిగి ఆరంభించింది. తద్వారా కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. విండోస్ 11కి ప్రత్యేకంగా తెచ్చిన ఏఐ కోపైలెట్‌ని విండోస్ 10 ఇప్పటికే పొందింది. విండోస్ 10 కోసం బేటా చానల్‌ని ఆరంభించినట్టు మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. విండోస్ 10కి సంబంధించి కొత్త ప్రణాళికలను మైక్రోసాఫ్ట్ ఇంకా బైటపెట్టలేదు.
అయితే విండోస్ ఇన్‌సైడర్స్ బేటా చానల్‌ని ఆప్ట్ చేసుకుంటే ఫీచర్లను పొందే అవకాశం ఉంటుంది. విండోస్ 10ని ఉపయోగించే వాళ్ళ కోసం పెయిడ్ సెక్యూర్టీ ఆప్డేట్స్‌ని ఆఫర్ చేసింది. బిజినెస్ సముదాయాలు అందుకోసం ఏడాదికి 61 డాలర్లు చెల్లించాలి. రెండో ఏడాదికి రెండింతలు అవుతుంది. మూడో ఏడాదికి మళ్లీ రెట్టింపు అంటే 122, 244 డాలర్లుగా ఫీజు ఉంటుంది.
వ్యక్తిగత వినియోగదారులు ఎంత చెల్లించాలన్నది మాత్రం మైక్రోసాఫ్ట్ ఇంకా వెల్లడించలేదు. యూజర్లు 11కి షిప్ట్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ యత్నిస్తోంది. అయితే హార్డ్‌వేర్ రిక్వైర్‌మెంట్స్ కారణంగా ఆ పని జోరందుకోవడం లేదు. 2018 తరవాత విడుదలైన సీపీయూ మాత్రమే విండోస్ 11ని సపోర్ట్ చేస్తుంది. డివైజ్ కాస్తా టీపీఎం సెక్యూరిటీ చిప్స్‌ను సపోర్ట్ చేస్తుంది. 2015లోనే విండోస్ 11ని విడుదల చేశారు. తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా 68 శాతం మంది విండోస్10నే ఉపయోగిస్తుండటం విశేషం
Updated Date - Jun 08 , 2024 | 05:29 AM